2017లో పవన్ పొలిటికల్ ఎంట్రీ!!

జనసేన అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసిన పవన్ కల్యాణ్.అటు టీడీపీ-ఇటు బీజేపీ కి తన మద్దతును ప్రకటించి వాటి కోసం ప్రచారం చేశాడు.

అయితే ఆయన పుణ్యమో.లేక ప్రతిపక్షాల ఖర్మమొ కానీ మొత్తానికి ఆ రెండు పార్టీలు అధికారాన్ని అందుకున్నాయి.

ఇదిలా ఉంటే.తాజా పరిస్థితులు చాలా విచిత్రంగా మారాయి.

ఎన్నికల ముందు చాలా ఆర్భాటంగా మొదలైన జనసేన కార్యకలాపాలు ఇప్పుడు ఎక్కడిక్కడ స్తంభించి పోయాయి.ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడనే విమర్శలు చాలా బహిరంగానే వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే వాటిని అసలు పట్టించుకోకుండా పవన్ తన సినిమాలతో బిజీగా మారిపోయాడు.పవన్ వరకు ఎలా ఉన్నా.

పవన్ మౌనంతో అభిమానులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను సరిగా నెరవేర్చకపోవడంతో.

ఆ హామీలను నెరవేర్చింపజేసే బాధ్యత నాది.అని చెప్పి వెళ్లిన పవన్ పై విమర్శలకు అభిమానులు కౌంటర్ ఇవ్వలేక మౌనం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాజధాని విషయంలో తమకు న్యాయం చెయ్యమని పవన్ ను కలిసిన రైతులకు నిరాశే ఎదురయింది.తాను ప్రస్తుతం రాజకీయం మాట్లాడనని.2017 తర్వాత మాట్లాడతాను అని, అప్పుడు జనాల సమస్యలపై స్పందిస్తానని పవన్ చెప్పాడట! దాని అర్ధం పవన్ కల్యాణ్ డైరెక్ట్ గా ఎన్నికల రంగంలోకి దూకడమే అంటున్నారు కొందరు వీరాభిమానులు.మరి ఇది ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు