నక్క తోక తొక్కినట్లున్నాడు!

పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందంటే ఆ దర్శకుడు స్టార్‌ అయిపోయినట్లే లెక్క.

పవన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు.

పవన్‌తో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం దర్శకుడు డాలీ దక్కించుకున్నాడు.ఈయన దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ‘గోపాల గోపాల’ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా ఆడియో వేడుకలో తాను డాలీతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడు.అయితే డాలీతో పవన్‌ కళ్యాణ్‌ సినిమా రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని అంతా అనుకున్నారు.

అయితే త్వరలోనే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.పవన్‌ హీరోగా దాసరి నారాయణ రావు నిర్మాణంలో ఒక సినిమా ఇటీవలే ఖరారు అయ్యింది.

Advertisement

ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో గత కొంత కాలంగా చర్చ జరుగుతూనే ఉంది.అయితే తాజాగా డాలీ పేరును దాసరికి పవన్‌ సూచించినట్లుగా తెలుస్తోంది.

డాలీకి దాసరి కూడా ఓకే చెప్పాడ.దాంతో ప్రస్తుతం డాలీ స్క్రిప్ట్‌ వర్క్‌తో బిజీ అయ్యాడు.

త్వరలోనే డాలీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా దాసరి నిర్మాణ సంస్థలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచాం అందుతోంది.మొత్తానికి దర్శకుడు డాలీ వరుసగా రెండు సినిమాలు పవన్‌తో చేసి అదృష్టాన్ని మూటకట్టుకుంటున్నాడు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు