తెలంగాణ‌లో ప‌వ‌న్ మిత్ర‌ప‌క్షం రెడీ..!!

తెలుగు రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉండ‌గానే.ఇప్ప‌టి నుంచే వివిధ పార్టీల సామ‌ర్థ్యం ఎంత ? ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి ? కొత్త పార్టీల ఎఫెక్ట్ ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్నదానిపై రాజ‌కీయంగా అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే ఏపీలో కంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు అక్క‌డ ఆ పార్టీ వ్య‌తిరేక శ‌క్తుల‌న్ని ఒక్క‌ట‌య్యేందుకు రెడీ అవుతున్నాయి.

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ చేతులెత్తేసే ప‌రిస్థితే ఉంది.ఇక్క‌డ అక్కడ టీడీపీ, బీజేపీ ఉండ‌నే ఉన్నాయి.ఇప్పుడు అక్క‌డ అంద‌రి దృష్టి కొత్త‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ప‌వ‌న్ జ‌న‌సేన‌పై ఉంది.

జ‌న‌సేన ఎఫెక్ట్ తెలంగాణ‌లో ఎంత వ‌ర‌కు ఉంటుంది ? అన్న ప్ర‌శ్న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సంస్థాగ‌తంగా స్ట్రాంగ్‌గా ఉన్న ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తుకు సంకేతాలు ఇస్తున్నాయి.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కూడా క‌మ్యూనిజం భావాజ‌లం ఉంది.దీంతో క‌మ్యూనిస్టు నాయ‌కులు సైతం ప‌వ‌న్‌తో జోడీ క‌ట్టేందుకు ముందుగానే సంకేతాలు వ‌దులుతున్నారు.క‌మ్యూనిస్టులు పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

జనసేన అధినేత పవన్‌, గాయకుడు గద్దర్, చంద్రకుమార్, కోదండరాం లాంటి మేథావుల‌తో చర్చించి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని తమ్మినేని వీరభద్రం ప్ర‌క‌టించ‌డం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది.ప‌వ‌న్‌కు తెలంగాణ‌లో మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది.

క‌మ్యూనిస్టుల‌కు ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉంది.గ‌ద్ద‌ర్‌కు కూడా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఇలా ఈ మూడు శ‌క్తుల క‌ల‌యిక వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ఎంతైనా ఎఫెక్ట్ ఉంటుంద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు