పోలీసులకు లొంగిపోయిన చింటూ

ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన చిత్తూర్ మేయర్ కటారి అనూరాధ , ఆమె భర్త మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ పోలీసులకు లొంగిపోయాడు.

ఇతను అనూరాధ మేనల్లుడు.

చింటూ కొందరు కిరాయి హంతకులతో కలిసి అనూరాధను, ఆమె భర్తను మేయర్ కార్యాలయంలోనే హత్య చేయడం తీవ్ర సంచలనం కలిగించింది.అనూరాధ టీడీపీ నాయకురాలు.

అనూరాధ దంపతుల హత్య తరువాత పారిపోయిన చింటూ తనంతట తానే లొంగిపోయాడు.ఇతను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.

లొంగిపోయిన నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ కష్టడీకి పంపింది.నిందితుడిని వారం రోజుల పాటు ఇంటరాగేట్ చేయడానికి పోలీసులు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.

Advertisement

చింటూ తన మేనత్తను చాలా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.మేయర్ దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని, అయినా పోలీసులకు లొంగిపొతానని చింటూ రెండు రోజుల క్రితం మీడియా కార్యాలయాలకు లేఖ పంపాడు.

పోలీసుల ఇంటరాగేషన్లో ఎలాంటి విషయాలు బయట పడతాయో.

Advertisement

తాజా వార్తలు