చిరంజీవి కి భలే షాక్ ఇచ్చిన చంద్రబాబు

సినిమాలలోంచి పాలిటిక్స్ లోకి వెళ్లి అట్టర్ ప్లాప్ అయిన మెగా స్టార్

చిరంజీవి ప్రాస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ కి అమ్మేసుకున్న చిరంజీవి పదవి కోసమే ఆ పని చేసారు అని అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు కాపుల రిజర్వేషన్ విషయం లో చిరంజీవి ముఖ్యమంత్రి చంద్రబాబు కి లేఖ రాయడం చర్చనీయాంశం అయ్యింది.

ఎప్పుడూ సైలెంట్ గా ఉండే చిరు సడన్ గా ఈ కాపు ఘర్జన సమయంలోనే ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ కాపునాయకత్వం జాబితాలోంచి తన పేరు పోతుందో అని ఆయన ఆ విధంగా లేఖ ఇచ్చారన్నది ప్రజల్లో వున్న అభిప్రాయం.

అంతే తప్ప, రాజకీయంగా చిరంజీవి అంత ఏక్టివ్ గా లేరన్నది కూడా వాస్తవం.అయితే ఇప్పుడు బాబేమన్నారంటే.

Advertisement

సామాజిక న్యాయం, కాపులను బిసీల్లో చేరుస్తాం అంటూ పార్టీ పెట్టిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసారని, కానీ ఏనాడూ ఆ విషయమై పార్టీని నిలదీయలేదని, తనకు మాత్రం లేఖ రాస్తారని అన్నారు.

ఇక్కడ ఇప్పుడు పాపం చిరంజీవి ఏ సమాధానం చెబుతారు? నిజమే కదా.బాబు అన్నది.కాంగ్రెస్ ను ఆయన నిలదీయకుండా వుండిపోయింది.

ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ను దేని కోసం చిరంజీవి నిలదీసారు కనుక? సమైక్య పోరులో కూడా ఆయన తన పదవిని అంటిపెట్టకునే ఏదో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసిన సంగతి తెలిసిందే కదా.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు