వైసీపీ ఎమ్మెల్యేకు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చిన బాబు

ప్ర‌తిపక్ష వైసీపీ నుంచి నాయ‌కుల‌ను చేర్చుకున్నప్పుడు క‌నిపించిన ఉత్సాహం టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌నిపించ‌డంలేదు.

ఆయా నాయ‌కుల చేరితో పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఊహించిన ఆయ‌న‌కు.

ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.క‌డ‌ప‌, క‌ర్నూలు.

ఇలా రాయ‌లసీమ జిల్లాల్లో ఇప్పుడు వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది.ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోనూ ఇది బ‌హిర్గత‌మైంది.

ముఖ్యంగా ఆ జిల్లా కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాంకు బాబు షాక్ ఇచ్చారు.క‌ర‌ణం కంచుకోట అయిన అద్దంకిపై ఆశ‌లు వ‌దులుకోవాల‌ని తేల్చి చెప్పారు.

Advertisement

పార్టీ ఆదేశాలు ధిక్క‌రిస్తే ఇక ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టంచేశార‌ట‌.అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌ణం బ‌ల‌రాం, గొట్టిపాటి ర‌వికుమార్ వ‌ర్గాల మ‌ధ్య వైరం ఉంది.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గొట్టిపాటి.ఇటీవ‌లే టీడీపీలో చేరారు.

దీనిని క‌ర‌ణం బ‌ల‌రాం వ్య‌తిరేకించినా.కరణం ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే చంద్రబాబు.

రవికుమార్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వచ్చాయి.ఆయ‌న పార్టీలో చేరిన అనంత‌రం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.ఒకరిని ఒకరు కొట్టుకునే దాకా కూడా పరిస్థితి వెళ్లింది.

Advertisement

చంద్రబాబు నుంచి గట్టి హామీ తీసుకున్న తర్వాతే.రవికుమార్ సీనియర్ అయిన బలరాంతో ఢీకొట్టేందుకే సిద్ధప‌డ్డార‌ని స‌మాచారం.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కమిటీ స‌మావేశంలో కరణం బ‌ల‌రామ్‌కు చంద్రబాబు గట్టిగానే వార్నింగు ఇచ్చినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.

అద్దంకి నియోజకవర్గంపై ఆశలు వదులు కోవాలని చంద్రబాబు నేరుగా చెప్పారట.ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటికే ఆ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో వదిలేయాల్సిందేనని కూడా బలరాంకు ఆదేశాలు జారీ చేశారట.

అంతే కాకుండా గొట్టిపాటితో వైరాన్ని తెంచుకోవాలని, కలిసి పనిచేయాలని కూడా చెప్పారట.పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కూడా కరణం ముఖం మీదే చెప్పేశారట.

పార్టీ సీనియర్ నేతగా ఉన్న త‌న‌కు ఎమ్మెల్సీగానో, లేక‌ దానికి తగ్గ ఏదైనా పదవి ఇస్తానని లేదా నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ సీట్లు పెరిగితే.త‌న‌యుడు కరణం వెంకటేశ్ కు మరో చోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చార‌ట‌.

అధినేత తన ముఖం మీదే హెచ్చరికలు చేస్తూ.పదవుల కోసం వేచి చూడాలన్న కోణంలో మాట్లాడటంతో బలరాం ఇబ్బంది పడ్డారట.

ఈ నేప‌థ్యంలో మ‌రి క‌ర‌ణం బ‌ల‌రాం ఏనిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!! .

తాజా వార్తలు