కిడ్నాప్ కేసులో విద్యాబాలన్..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఓ కిడ్నాప్ మర్డర్ కేసులో ఇరుక్కుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

అంతేకాదు ఈ కేసుకి సంబందించి ఆమె పరారీలో ఉండటంతో ఆమె గురించి వాంటెడ్ పోస్టర్ కూడా వేశారు.

ఏంటి ఇదంతా నిజమేనా అంటే అవును నిజమే కాని రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.కహాని టీం మరోసారి విద్యాతో మరో ప్రయోగానికి సిద్ధమైంది.గర్భిణితో తప్పిపోయిన భర్తని వెతకే క్రమంతో తీసిన కహాని ఎంతటి సంచలనా విజయం అందుకుందో తెలిసిందే.

ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు సుజయ్ ఘోష్ డైరక్షన్లోనే కహాని-2 తెరకెక్కుతుంది.అందులో కిడ్నాపర్ గా విద్యా నటిస్తుంది.దానికి సంబందించిన పోస్టర్ ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టి సినిమా ప్రమోట్ చేస్తుంది విద్యాబాలన్.

బాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విద్యాబాలన్ కు ఇలాంటి సినిమాలు తీయడం మాములే.తనకంటూ ఓ ప్రత్యేకమైనా క్రేజ్ ఏర్పరచుకున్న విద్యా ఈ కహాని-2తో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

పెళ్లి తర్వాత కాస్త స్లో అయినట్టు కనిపించిన విద్యా బాలన్ ఇక నుండి వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తుందట.ప్రస్తుతం కహాని-2 పోస్టర్ మాత్రం ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు