బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న సెలబ్రిటీలు వీరే

వివాదాస్పదం, సంచలనాత్మకం .బిగ్ బాస్ షో అంటే ఇలాంటి పదాలే గుర్తుకు వస్తాయి.

ఇప్పటికే మీరు హిందీ బిగ్ బాస్ చూసుంటే ఈ ఆట ఎలా ఆడతారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇది ఎలాంటి వివాదాలకి కేంద్రబిందువు అవుతుందో గుర్తుచేయనక్కరలేదు.

ఎంత వివాదం ఉంటే అంత మజా, పార్టిసిపెంట్స్ ఎంత తిక్కగా ఉంటే అంత కిక్కు.ఎన్ని గొడవలు జరిగితే అంత టీఆర్పీ.

గొడవలు - గ్లామర్ .అదే బిగ్ బాస్.అందుకే, తెలిసిన ముఖాలు గొడవలు పడితే ఆసక్తికరంగా ఉంటుందనే పాపులర్ సెలబ్రిటిలను బిగ్ బాస్ ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

Advertisement

మరి 70 రోజుల పాటు సాగే ఈ షో లో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సెలబ్రిటీలు ఎవరో చూద్దామా ? రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ 14 పేర్లు వినిపిస్తున్నాయి.ఇందులో ఎంతమంది ఉంటున్నారో ఈరోజు సాయంత్రం స్వయంగా ఎన్టీఆర్ మాటల్లో వినొచ్చు.

* సంపూర్నేష్ బాబు * తేజస్వి మడివాడ * హరి తేజ * ధన్ రాజ్ * ముమైత్ ఖాన్ * కత్తి కార్తిక * మహేష్ కత్తి * ఆదర్శ్ * సమీర్ * మధు ప్రియ * అర్చన * కల్పన * జ్యోతి * శివ బాలాజీ .

Advertisement

తాజా వార్తలు