లోకేష్ టీమ్ తయారు

ప్రతీ రాజకీయ నాయకుడికీ ప్రత్యేక బృందం ఉంటుంది.పూర్వ కాలంలో రాజుల దగ్గర కూడా అంతరంగికులు ఉండేవారు.

ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ బృందంతో చర్చిస్తారు.ఇలాంటి టీములు పాలకులకే కాకుండా పాటీ పదవుల్లో ఉండేవారికి కూడా ఉంటాయి.

మరీ కీలకమైన పదవిలో ఉంటే బృందం ఉండక తప్పదు.ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన బృందాన్ని తయారు చేసుకున్నారు.

అంటే టీమ్ లోకేష్ అన్న మాట.లోకేష్ ప్రధాన కార్యదర్శి హోదాలో కొన్ని జిల్లాలకు ఇంచార్జీలను నియమించారు.విశాఖపట్నం , తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు రామా నాయుడిని, గుంటూర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరికి రెడ్డి సుబ్రహ్మణ్యం, చిత్తూరు, కర్నూలుకు వర్ల రామయ్యను, కడప, అనంతపురం జిల్లాలకు జయనాగేశ్వర్ రెడ్డిని నియమించారు.

Advertisement

వీరు ఆయా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను, అభివృద్ధిని ఎప్పటికప్పుడు లోకేష్కు వివరిస్తారు.ఈ నాయకులు పార్టీలో సీనియర్లు.అనుభవజ్ఞులు.

కాబట్టి వారి సేవలను లోకేష్ ఉపయోగించుకోవడం కాకుండా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి.

Advertisement

తాజా వార్తలు