చిన్న సందు దొరికితే చాలు, ఏది పడితే అది రాసేస్తారు మిడియా వారు.నిన్నటి నుంచి అసిన్ పెళ్ళి నవంబర్ లో జరగనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నవంబర్ 26 న పెళ్ళి అని వచ్చిన వదంతులని కొట్టిపడేసింది అసిన్.మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో మనువాడనున్న ఈ బ్యూటి, తమ వివాహం అప్పుడే జరగట్లేదు అని స్పష్టంగా చెప్పేసింది.
ఇందాకే ఒక జాతియ దినపత్రిక రిపోర్టర్ తో అసిన్ మాట్లాడుతూ ” నా పెళ్ళికి సంబంధించి మిడియాలో వస్తున్న తేదిలను చుస్తే నవ్వోస్తోంది.ఎక్కడి నుంచి తీసుకువస్తారో ఇలాంటి గాలివార్తలు.
నా కమిట్మెంట్స్ ఇంకా పుర్తవలేదు.అవన్ని పూర్తి చేసేదాకా పెళ్ళి చేసుకోను.
నా పెళ్లి విషయాన్ని.నేనే అందరి ముందు చెప్పాను కదా.ఒక తేదిని ఫిక్స్ చేసుకుంటే నేనెందుకు దాస్తాను? అది కుడా నేనే చెబుతాను.కాబట్టి స్వయంగా నేను నా వివాహతేదిని ప్రకటించేదాకా ఏది నమ్మొద్దు ” అంటూ రూమర్స్ అన్నీటిని తీసిపారేసింది అసిన్.
అసిన్ మాటలను చూస్తోంటే, ఈ ఏడాది తన పెళ్ళి అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.







