జొమాటో( Zomato ) గురించి ఇక్కడ ప్రత్యేకమైన ప్రస్తావన అవసరం లేదు.ఆ పేరు వినగానే ప్రతి ఒక్కరి నోళ్ళల్లో నీరు ఊరుతాయి.
అంతలా ఈ ఫుడ్ డెలివరీ యాప్ జనాల్లోకి దూసుకుపోయిది.భారతదేశంలో అత్యధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉన్న వాటిలో జోమాటో ఒకటి.
జొమాటోను పంజాబ్‌కు చెందిన దీపిందర్ గోయల్( Deepinder Goyal ) స్థాపించిన సంగతి విదితమే.ఇక ఈ జోమాటో ప్రపంచ వ్యాప్తంగా 10,000 నగరాల్లో 14 లక్షల మందికి పైగా వాడుతున్నట్టు తెలుస్తోంది.
పంజాబ్( Punjab )లో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన దీపిందర్ గోయల్ నేడు 2,030 కోట్లకు అధిపతిగా ఉన్నాడు అంటే అది అతని కార్యదక్షతకి తార్కాణం అని చెప్పుకోకతప్పదు.ఏడాదికి అతని సంపాదన 3 కోట్లకు పైమాటే.ఇకపోతే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు దీపిందర్ గోయల్ అని అంటూవుంటారు అందరూ.జొమాటో ప్రధాన కార్యాలయం ఉన్న హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై ఫెరారీ రోమా తరచుగా తిరుగుతూ ఉంటుంది.
ఇది దీపిందర్ గోయల్ వాహనమే.ఈ ఎరుపు రంగు ఫెరారీ దీపిందర్ గోయల్‌కు ఇష్టమైన వాహనాల్లో ఒకటి.
దానితోపాటు అతని గ్యారేజిలో చాలా కార్లు కొలువుదీరి ఉంటాయి.గోయల్ కు పోర్స్చే 911 టర్బో S కారు ఉంది.పోర్స్చే రేంజ్ కారు ఐకానిక్ స్పోర్ట్స్ కార్లలో ఒకటి.అదేవిధంగా కార్లలో రారాజుగా పేరుతెచ్చుకున్న లంబోర్ఘిని ఉరస్ కారు కూడా ఉంది.ఈ కారును ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SUV అని పిలుస్తారనే సంగతి విదితమే.
ఎందుకంటే ఈ కారు కేవలం 3.6 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగాన్ని అందుకోవడం విశేషం.లంబోర్ఘిని ఉరస్ స్పోర్ట్స్ కారు మార్కెట్ ధర రూ.4.18 కోట్లుగా ఉంది.అదేవిధంగా అతనికి 911 టర్బో Sతో పాటు పోర్స్చే 911 కారెరా S కారు కూడా ఉంది.దీని ధర రూ.1.88 కోట్ల వరకు ఉంది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన పోర్షే 911 కారెరా S వేగంతో పాటు ప్రయాణీకులకు ఎంతో భద్రతను అందిస్తుంది.