ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన కస్టమర్లకు మరో శుభవార్తను అందించింది.అవును… జొమాటో మరో నూతన సేవను అందుబాటులోకి తెస్తోంది.దీని ద్వారా మరింతమంది వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.జొమాటో యాజమాన్యంలోని Blinkit ఇకపై తన కస్టమర్లకు కేవలం 11 నిమిషాల్లో ఇంటివద్దకే ప్రింట్ అవుట్‌లను డెలివరీ అందజేయనున్నట్లు ఈ గురువారం వెల్లడించింది.
మనం తరుచూ కొన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతుంటాం.
ఇంట్లో ప్రింటర్ లేకపోవటం, జెరాక్స్ లేదా ప్రిట్ అవుట్ అవసరమైనప్పుడు సైబర్ కేఫ్ లేదా లైబ్రరీ లేదా ఇరుగుపొరుగు వారి నుంచి లేదా ఆఫీస్ నుంచి పొందడం ఇబ్బందికరంగా మారుతుంది.
కొన్ని సార్లు కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో అప్పటికప్పుడే మనకి సంబంధిత జెరాక్స్ వంటివి అవసరం ఏర్పడతాయి.అలాంటప్పుడు మనకి దగ్గరలో ఆ సౌకర్యం లభించనప్పుడు గందరగోళానికి గురవుతూ ఉంటాము.
ఇక ఇలాంటి కారణాలను ఎన్నింటినో పరిశీలించిన జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జొమాటో కంపెనీ ప్రతినిధి జితేష్ గోయెల్ మాట్లాడుతూ… ఈ సేవలు కస్టమర్లకు అందుబాటు ధరల్లోనే ఉంచుతామని పేర్కోవడం గమనార్హం.కస్టమర్లు ప్రింట్ అవుట్ కోసం ఫైల్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని.తరువాత దానిని నిమిషాల్లో డెలివరీ చేస్తమని వెల్లడించారు.
అలాగే డెలివరీ తరువాత అప్‌లోడ్ చేసిన ఫైల్‌ను వెంటనే తొలగిస్తామని కూడా స్పష్టం చేశారు.రెండు కంపెనీల మధ్య టెక్ ఇంటిగ్రేషన్‌లు రెండు వైపులా పురోగతిని వేగవంతం చేస్తాయని కంపెనీ చెబుతోంది.
బ్లింకిట్ నిరంతర వృద్ధికి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.