10,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం

ఇండియాలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థల సంఖ్య విపరీతంగా పెరిగి పోతూనే ఉంది.

అయితే జొమాటో మాత్రం మొదటి నుండి ఉండటంతో ఆ సంస్థకు ఇండియన్‌ మార్కెట్‌లో ఎక్కువ వాటా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే గత కొంత కాలంగా జొమాటో ఆర్థికంగా నష్టాలను చవిచూస్తుంది.ప్రస్తుతం జొమాటో 24 దేశాల్లో 10 వేల నగరాల్లో ఫుడ్‌ డెలవరీ చేస్తోంది.

ఇండియాలో 550 నగరాలు మరియు పట్టణాల్లో ఫుడ్‌ను డెలవరీ చేస్తోంది.నష్టాల కారణంగా జొమాటో ఇండియా సంస్థ నుండి ముఖ్యమైన 540 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది.

ఈ విషయమై జొమాటో ప్రతినిధి స్పందిస్తూ.గతంలో కంటే ప్రస్తుతం కస్టమర్‌ సర్వీస్‌ చాలా తగ్గడంతో పాటు, అన్ని విషయాలకు డిజిటల్‌ సేవలు వచ్చిన కారణంగా కొంత మందిని తగ్గిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే వారికి ఎలాంటి అన్యాయం చేయకుండా రెండు నెలల జీతం, ఈ ఏడాది చివరి వరకు కొన్ని కంపెనీ సేవలు కొనసాగించనున్నాం.అదే సమయంలో వారికి జాబ్‌ ఫెయిర్‌లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇక భవిష్యత్తులో జొమాటో 10 వేల మందిని కొత్తగా హైర్‌ చేసుకోబోతుంది.డెలవరీ బాయ్స్‌ నుండి ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ వరకు అన్ని విధాలుగా కలిపి 10 వేల మందికి ఉపాది కల్పించబోతున్నట్లుగా ఆయన అన్నాడు.

జొమాటోను దేశంలో ఇంకా భారీగా విస్తరించబోతున్నట్లుగా ఆయన అన్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?
Advertisement

తాజా వార్తలు