జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట సినిమాగా ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ సినిమాలులో!

హైదరాబాద్, 23ఫిబ్రవరి 2024:ఈ లీపు సంవత్సరాన్ని మరింత స్పెషల్గా మార్చేందుకు ఫిబ్రవరి 29న ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి జీ సినిమాలు సిద్ధంగా ఉంది.సరికొత్త సూపర్హిట్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ సినిమాలు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ -అహ నా పెళ్లంటమొత్తం సీజన్ని సినిమాగా అందించనుంది.

జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ అహ నా పెళ్లంట( Aha Naa Pellanta ) ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ సినిమాలులో!ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది.ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్ తో చెప్పే కథే అహ నా పెళ్లంట( Aha Naa Pellanta )ఈ సిరీస్కథ మొత్తం శీను (రాజ్ తరుణ్)( Raj Tarun ) చుట్టూ తిరుగుతుంది.

స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను.కానీ అనుకోకుండా మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది.తర్వాత ఊహంచని ట్విస్ట్తో కథ మలుపు తిరుగుతుంది.అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? మహా, శీను జీవితాన్ని మారుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే జీ సినిమాలులో సినిమాగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే.జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో హీరోరాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ నటి ఆమని( Aamani ) నటించగా, నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో నటించారు.భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అహ నా పెళ్లంటఈ గురువారం మీ ముందుకు రాబోతుంది.తప్పక చూడండి! .

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు