Shahrukh Khan : హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 10 హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ లో ఎవరంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు( Celebrities ) ఒక సినిమా రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే చాలు వెంటనే రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తూ ఉంటారు.ప్రస్తుత రోజుల్లో దాదాపుగా 50 ,60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా ఉన్నారు.

 Indian Heros Remunerations-TeluguStop.com

ఒక తెలుగు హీరోలు మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ హీరోలు కూడా ఈ లిస్టులో ఉన్నారు.ఇకపోతే మొన్న‌టి వ‌ర‌కూ భార‌తీయ సినీప‌రిశ్ర‌మ అంటే హిందీ చిత్ర‌సీమనే అని అనుకునే వారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది కానీ, హిందీ స్టార్లు తాము మాత్ర‌మే గొప్ప‌వాళ్లం అనుకుని జ‌బ్బ‌లు చ‌రుచుకునే ప‌రిస్థితి ఉండేది.భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రేక్షకులే అత్య‌ధికంగా ఉండ‌డంతో హిందీ చిత్ర‌సీమ ప్ర‌ధాన చిత్ర‌సీమ‌గా ఏలింది.

Telugu Aamir Khan, Akshay Kumar, Bollywood, Dalapati Vijay, Indian Heros, Prabha

హిందీ అత్యధిక సంఖ్యలో ప్ర‌జ‌లు మాట్లాడే భాష.అందువల్ల అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ తార‌లలో కొందరు బాలీవుడ్ నుండి ఉన్నార‌న‌డంలో ఆశ్చర్యం లేదు.అయితే జనాల‌ నమ్మకానికి విరుద్ధంగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ -10 భారతీయ నటులలో చాలామంది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలే ఉండ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.ద‌క్షిణ భారత‌ సినిమా ఇటీవలి కాలంలో ప్రధాన స్రవంతిలో డామినేష‌న్ కొన‌సాగించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

యాక్షన్ ప్యాక్డ్ కథాంశాల‌తో దేశ‌వ్యాప్తంగా ఉన్న మాస్‌ని ఒక ఊపు ఊపేస్తున్నారు.అన్ని భారతీయ ప్రాంతాల ప్రేక్షకులను ఆకర్షించే ప‌రిశ్ర‌మ‌గా ద‌క్షిణాది ఎదిగింది.ద‌క్షిణాది చాలా కాలంగా దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది.

Telugu Aamir Khan, Akshay Kumar, Bollywood, Dalapati Vijay, Indian Heros, Prabha

ఫలితంగా దక్షిణ భారత తార‌లు అత్యధిక పారితోషికం అందుకునే టాప్ 10 భారతీయ నటుల జాబితాలోకి ప్రవేశించారు.మరి ఆ టాప్ 10 లో ఉన్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇందులో నెంబర్ వన్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )ఉన్నారు.

ఆయన ఒక్కొక్క సినిమాకు దాదాపుగా 150 కోట్ల నుంచి 250 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.రెండో స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ఉన్నారు.ఆయన 150 కోట్లు నుంచి 210 కోట్ల వరకు తీసుకుంటున్నారు.ఇక మూడో స్థానంలో దళపతి విజయ్ ( Dalapati Vijay )130 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అందుకుంటున్నారు.4వ స్థానంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అందుకుంటున్నారు.ఈ విషయంలో ఐదవ స్థానంలో అమీర్ ఖాన్( Aamir Khan ) రూ.100 కోట్లు-175 కోట్ల రూపాయలను అందుకుంటున్నారు.సల్మాన్ ఖాన్( Salman Khan ) రూ.100 కోట్లు-150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుండగా కమల్ హాసన్ రూ.100 కోట్లు-150 కోట్లు తీసుకుంటున్నారు.అల్లు అర్జున్ రూ.100 కోట్లు-125 కోట్లు తీసుకుంటున్నారు.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రూ.60 కోట్లు-145 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.అలాగే అజిత్ కుమార్ రూ.105 కోట్లు ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత 100 కోట్లు అందుకుంటున్న స్టార్లుగా రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube