వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా పాన్ ఇండియా సినిమా హనుమాన్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 23 ఏప్రిల్ 2024: వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు( Zee Telugu ) ఈ వారం మరో సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాతో మీ ముందుకు రానుంది.థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ హనుమాన్.

 Zee Telugu Presents The World Television Premiere Of Hanu Man, Zee Telugu , Worl-TeluguStop.com

( Hanu Man ) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా( World Television Premiere ) అందిస్తోంది జీ తెలుగు.ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన ‘హనుమాన్’ చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి.

బుల్లితెరపై ‘హనుమాన్’ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే!

అందమైన అంజనాద్రి గ్రామం నేపథ్యంలో సాగే హనుమాన్ సినిమా కథ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా( Teja Sajja ) పోషించిన హనుమంతు పాత్ర చుట్టూ తిరుగుతుంది.హనుమంతు మంచి మనసు కలిగిన ఒక దొంగ.

తన ప్రియురాలు మీనాక్షిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనేది అతని కల.కానీ హనుమంతుకి దొరికిన రుధిరమణి కారణంగా అద్భుత శక్తులు రావడంతో ఆ గ్రామంలో హీరో అవుతాడు.ప్రముఖ నటుడు వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్గా నటించారు.రుధిరమణి కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు? అనేది తెలుసుకోవాలంటే హనుమాన్ సినిమా చూడాల్సిందే!

ఆకట్టుకునే కథ, యాక్షన్ సీక్వెన్స్, హనుమంతు, మీనాక్షి(అమృతా అయ్యర్)ల ప్రేమ వంటి అంశాలతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు.ప్రేమ, ధైర్యం, దైవత్వంతో ముడిపడి ఉండే హనుమాన్ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్,( Varalaxmi Sarath Kumar ) వినయ్ రాయ్( Vinay Roy ) తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

అదిరిపోయే విజువల్స్, హృదయాన్ని హత్తుకునే యాక్షన్, ఆకట్టుకునే నటనతో మునుపెన్నడూ లేని విధంగా హనుమాన్ సినిమా వినోదాన్ని పంచుతుంది.మనసుని హత్తుకునే కథ, కథనంతో సాగే హనుమాన్ సినిమాని మీరూ మిస్ కాకుండా చూసేయండి!

అంతేకాదు, ఈ వారాంతాన్ని మరింత స్పెషల్ చేసేందుకు సూపర్ హిట్ సినిమా హనుమాన్తో పాటు మరిన్ని సర్ప్రైజ్లను అందిస్తోంది జీ తెలుగు.

ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫీ కాంటెస్ట్లో పాల్గొని కళ్లుచెదిరే కిచెన్ ఐటెమ్స్ని బహుమతులుగా పొందవచ్చు.ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.

మీ పిల్లలకి ఇష్టమైన సూపర్హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి, లేదంటే టీవీ స్క్రీన్పైన కనిపించే QR కోడ్ని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చు.విజేతల వివరాలను హనుమాన్ సినిమా ప్రసార సమయంలో ప్రకటిస్తారు.అంతేకాదు హనుమాన్ జిగ్సా ఫజిల్ గేమ్ ని zeeteluguhanuman.zee5.com కి లాగిన్ అయి ఇచ్చిన టైమ్లోగా లెవల్స్ను పూర్తి చేస్తూ స్కోర్ బోర్డు లో లీడర్ గా నిలవండి.ఇంకెందుకు ఆలస్యం వెంటన్ గేమ్ ఆడేయండి!

జీ తెలుగు అందిస్తున్న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హనుమాన్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, తప్పక చూడండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube