మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ( Farmer loan waiver ) చేయకపోతే రాజీనామా చేస్తారా అని హరీశ్ రావు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ( BRS party )ని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.తన సవాల్ ను స్వీకరించేందుకు హరీశ్ రావు సిద్ధమా అని నిలదీశారు.సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే దమ్ముంటే హరీశ్ రావు తన ఛాలెంజ్ ను స్వీకరించాలని స్పష్టం చేశారు.