ఎడారిలో జీబ్రాల ప్రయాణం.. అసలేదో నీడేదో తెలియనంతగా..!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎన్నో వీడియోలు మనకు చేరువవుతున్నాయి.ప్రపంచంలో ఏమూల ఆసక్తికర ఘటన జరిగినా, క్షణాల్లో మనకు ఫోన్లలో దర్శనమిస్తున్నాయి.

 Zebras Travelling In Desert Illusion Pic Viral Details, Zebra, Photo, Viral Lat-TeluguStop.com

ఇందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.మరికొన్ని నవ్విస్తాయి.

ఇంకొన్ని హృదయాలను ద్రవింపజేస్తాయి.తికమక పెట్టే వీడియోలు కూడా కనిపిస్తాయి.

ఇదే కోవలో కొన్ని ఫొటోలు మనకు చూడగానే ఓ పజిల్‌లా అనిపిస్తాయి.తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

దాని గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఇటీవల ఫేమస్ అయిన ఓ ఫొటోలో జీబ్రాలు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుంటాయి.

అవి భారీ సైజులో కనిపిస్తుంటాయి.ఏది ముందు వెళ్తుందో, ఏది వెనుక వెళ్తుందో, ఏవి పక్కపక్కన వెళ్తున్నాయో తెలియనంతగా ఫొటో మనలను కన్ఫ్యూజన్‌లో పడేస్తుంది.

అయితే అదంతా మన కళ్లకు కలిగే ఆప్టికల్ ఇల్యూషల్ వల్ల మాత్రమే అలా అనిపిస్తుంది.జాగ్రత్తగా ఆ ఫొటోను పరిశీలిస్తే ఆ ఫొటోను దాదాపు నిట్టనిలువుగా పై నుంచి తీసినట్లు తెలుస్తోంది.

దాని వల్ల ఏటవాలు కోణంలో ఉన్న ఆ ఫొటోలను చూసినప్పుడు అసలు జంతువుల కంటే వాటి నీడలు పెద్దగా కనిపిస్తాయి.అంతేకాకుండా బాగా పరిశీలిస్తేనే అసలు జీబ్రాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది.

ఓ మ్యాగ్‌జీన్‌లో పబ్లిష్ అయిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గతంలో ఉత్తమ ఫొటోగ్రఫీ పోటీలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube