ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది.గూగుల్ క్రోమ్ వెర్షన్ మూడంకెలకు చేరింది.
తన 100వ వెర్షన్‌పే ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29న విడుదల చేసింది.అంతేకాకుండా 2014లో చివరి సారి లోగో అప్ డేట్ చేసింది.7 ఏళ్ల తర్వాత మరోసారి లోగో అప్ డేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.కొత్త వెర్షన్ సేవలు విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్స్, లైనక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించే గాడ్జెట్లలో అందుబాటులోకి రానున్నాయి.
తొలుత డెస్క్‌టాప్ వినియోగదారులు ఈ సేవలను ఆస్వాదించవచ్చు.గూగుల్ క్రోమ్ 100 వెర్షన్‌ని స్థిరమైన ఛానెల్‌కు, 101ని కొత్త బీటా వెర్షన్‌గా ప్రమోట్ చేసింది.క్రోమ్ 102 కానరీ వెర్షన్‌గా ఉంటుంది.
గూగుల్ క్రోమ్ విడుదల చేసిన 100వ వెర్షన్‌లో కొత్త ఫీచర్లేమీ లేవని సంస్థ తెలిపింది.
విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించే వారు ఈ కొత్త వెర్షన్ వినియోగించుకునేందుకు ఇలా చేయాల్సి ఉంటుంది.సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత హెల్ప్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తదుపరి ఎబౌట్ గూగుల్ క్రోమ్‌ను క్లిక్ చేసి క్రోమ్ 100కి అప్‌డేట్ అవ్వొచ్చు.
గూగుల్ 100 వెర్షన్ విడుదల చేసే ముందు సంస్థకు ఆందోళన పట్టుకుంది.ఈ మూడంకెల వెర్షన్ విఫలమైతే చాలా వెబ్‌సైట్‌లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
సెప్టెంబరు 2021 నుండి గూగుల్ క్రోమ్ దీనిపై పరీక్షలు చేస్తోంది.అయితే విడుదల చేసిన తర్వాత ఏ ముప్పూ లేకపోవడంతో సంస్థకు గొప్ప ఊరట దక్కింది.







