ఏపీలో ఆలయాల దాడులు ఘటనపై వై వి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..!!- Yv Subbareddys Key Remarks On Temple Attack Incident In Ap 2

Andhra pradesh,ysrcp,ttd,yv subha reddy - Telugu Andhra Pradesh, Ttd, Ysrcp, Yv Subha Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడులు అనేక మంది మనోభావాలను దెబ్బ తీస్తున్న సంగతి తెలిసిందే.మరోపక్క ఈ ఘటనలను ఆధారంగా చేసుకొని వివిధ రాజకీయ పార్టీలు పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం తెగ తాపత్రయ పడటం చాలామంది సామాన్యులకు విస్మయాన్ని కలిగిస్తోంది.

మరో పక్క జరుగుతున్న విచారణలో చాలావరకు ప్రతిపక్షాల పార్టీలకు చెందిన పాత్ర కొన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆ దృశ్యాలు బయట పడుతున్నట్లు పోలీస్ అధికారులు చెప్పుకొస్తున్నారు.ఇలాంటి తరుణంలో తాజాగా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడుల వెనక సూత్రదారులెవరో వారంతట వారే ఒక్కొక్కరు బయట పడతారని అన్నారు.ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ అనుమానంలో వాస్తవం లేకపోలేదన్నారు.

ప్రజలను కాపాడే దేవుడిని.కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పుకొచ్చారు.

కొన్ని పార్టీల కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు వై వి సుబ్బారెడ్డి ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర అని మండిపడ్డారు.

#Andhra Pradesh #Ysrcp #Yv Subha Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు