వైసీపి ఎంపీల రాజీనామా..?జగన్ వ్యూహం ఏమిటంటే

ఏపీలో అధికారం కోసం హోరా హోరీ పోరు సాగడం మాత్రం ఖాయం.అధికార టిడిపి కి ప్రతిపక్ష వైసీపికి ఈ సారి పెద్ద ఎన్నికల యుద్దమే జరగనుంది.

 Ysrcp Mp’s Will Resignation In Parliament Session-TeluguStop.com

అయితే ఎవరి వ్యూహాలతో వారు కొత్త కొత్తగా ముందుకు దూసుకుపోతున్నారు.అయితే జగన్ మాత్రం చంద్రబాబు స్పీడుకి బ్రేకులు వేసేందుకు ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తున్న అస్త్రాలు అన్నిటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకి తీస్తున్నారు అని తెలుస్తోంది.

ఈ దెబ్బతో బాబుకి షాక్ తగలడం ఖాయం అంటున్నారు వైసీపి నాయకులు.

తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది…ఇప్పుడు మిగిలింది మాత్రం ఫలితాలు రావడమే.

ఇప్పటివరకు దేశంలో అన్ని పార్టీలు గుజరాత్ ఎన్నికలపై బాగా దృష్టి పెట్టాయి.ఈ ఫలితాల ఆధారంగా అనేక రాజకీయ పొత్తులు, ఎత్తుగడలు ముడిపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠగా ఉండేది.

కానీ ఈ పలితాలతో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని తేలిపోవడంతో ఒక్కసారిగా ప్రతి పార్టీలో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.అలాగే ఏపీ రాజకీయాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇదే సమయంలో ఏపీ ప్రజలలో తన ఇమేజ్ మరింత పెంచే విధంగా జగన్ వేస్తున్న స్కెచ్ ఇప్పుడు టిడిపికి గుండె దడ పుట్టిస్తోంది.ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్ సాక్షిగా వేడి పెంచాలని.

ప్రత్యేక హోదా అంశాన్ని వచ్చే ఎన్నికల అంశంగా మారుస్తూ వైసీపీ ఈ వ్యవహారంలో రాజకీయంగా కీలక మార్పు చేర్పులు చేపట్టాలని చూస్తోంది ఎత్తుగడలు వెయ్యాలని ఆలోచనలో ఉంది వైసీపీ.

ఇదే విషయంలో ఇప్పటికే ఎంపీ పదవులకి రాజీనామాలు చేస్తారు మా వాళ్ళు అని జగన్ ప్రకటించాడు కూడా.

ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చి.శీతాకాల సమావేశాల్లో వైకాపా ఎంపీలు ద్వారా పార్లమెంట్ లో వేడి పుట్టించడం ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని జగన్ ఆలోచన చేస్తున్నాడు.

ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించాలని జగన్ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.ఈ అంశంలో టిడిపిని ఏపిలో చేతగాని పార్టీగా చూపించి తానూ మార్కులు కొట్టేయాలని చేస్తున్నాడు జగన్.

మరి జగన్ ఎత్తులకి పై ఎత్తులు వేయకుండా ఉంటాడా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube