రాజకీయం నేర్చుకుంటున్న జనసేన పార్టీ

నిన్నా మొన్నటి వరకూ పవన్ పై విమర్శలు చేసేవాళ్ళకి పవన్ ఫ్యాన్స్ అటు సోషల్ మీడియాలోనూ.భాహిరంగంగా విమర్శించడం చేసేవారు…అనుకోకుండా ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు తన జనసేన పార్టీ తరుపున కూడా నాయకులు పవన్ కి మద్దతుగా విమర్సకులపై ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు.

 Janasena Not Different Party Other Than Political Parties-TeluguStop.com

ఒక పార్టీ నాయకుడి మీద ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా సరే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకులు ఎదురు దాడి చేయడం కామన్.

కానీ జనసేనలో నిన్నటి వరకూ కూడా వన్ మెన్ షో గానే మిగిలింది.

ఇప్పుడు రూటు మార్చేశాడు పవన్.

పవన్ కళ్యాణ్ ఇటీవల నాలుగు రోజులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

ఈ సదర్భంగానే ప్రత్యర్థి రాజకీయ నేతల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు.ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు.

మరి జగన్ అభిమానులు నాయకులు ఊరుకుంటారా వారు కూడా ఎదురు దాడి చేశారు.ఈ క్రమంలోనే వైసిపి ఎమ్యెల్యే… పవన్ వీరాభిమాని అయిన అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

గుండెల నిండా పవన్ మీద అభిమానం వున్నా దానిని పక్కన పెట్టి విమర్శలకు దిగారు.ఏకంగా మీడియా సమావేశం పెట్టి మండిపడ్డారు.

‘‘పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు.పవన్ చేసిన యాత్ర చంద్రబాబు ని కాపాడటానికి.జగన్ ని విమర్శించడానికి అన్నట్టుగా ఉంది.పవన్ మాటలు.

చేష్టలు ఏపీ ప్రజలు గమనిస్తున్నారు.వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు అంటూనే.

నేను పవన్ కు చాలా అభిమానినే.ఇందులో అనుమానం లేదు.

పవన్ చేస్తున్న రాజకీయాలు కుళ్లు రాజకీయాలనిపిస్తున్నది.అది నచ్చకే మనసు చంపుకుని పవన్ కళ్యాణ్ ను అభిమానించడం మానేస్తున్నాను’ అని స్పష్టం చేశారు.

అంతేకాదు ”పవన్ కు ఉన్నంత కులపిచ్చి” ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడుకి కూడా లేదు.ఇది జగమెరిగిన సత్యం,’ అన్నారు.అయితే జనసేన బాగా సీరియస్ గా స్పందించింది.పవన్ ని తిట్టిన అనిల్ మీద జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది…నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర అందరికి తెలిసిందే.

నెల్లూరు జిల్లాలో ఆయనొక అవినీతిపరుడు.రౌడీ అంటూ జనసేన చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు.

ఇప్పుడు అనిల్ పై జనసేన నేత చేసిన వ్యాఖ్యలు జనసేనలో ఉన్న కొత్త కోణాన్ని బయటపెడుతున్నాయి.అన్ని రాజకీయ పార్టీలు లానే జనసేన కూడా అనే మార్క్ చూపించేశారు జనసేన పార్టీ నాయకులు.

అయితే ఇక్కడ పవన్ పై సర్వాత్ర విమర్శలు మొదలయ్యాయి.పార్టీకి సంభందిచిన కీలక నిర్ణయాలు.

వేదికలమీద మాట్లాడే విషయంలో వన్ మెన్ షో చేసి తానోక్కడో ఈ పార్టీకి దిక్కు మొక్కు అనిపించేలా ఉండే పవన్.మరి ప్రతి విమర్శల సమయంలో పార్టీ నాయకులని వాడుకుంటున్నాడు.

ఇది జనసేన అసలు సినిమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube