ఎన్నిక హీట్ ఇప్పుడు ఏపీ మీదుగా తెలంగాణా చేరింది.రేవంత్ రాకతో మొన్నటి వరకూ స్తబ్ధతగా ఉన్న రాజకీయాలు ఒక్కసారి గా పెరిగి ఎన్నో సంచలనాలకి కారణం అయ్యాయి.
అయితే తరువాత మళ్ళి కొంత సైలెంట్ గా ఉన్నా.ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకం తో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి.
ఇప్పుడు టి-కాంగ్రెస్ లో సీనియర్ లీడర్స్ కి చెమటలు పడుతున్న విషయం ఒకటి చెక్కర్లు చేస్తోంది.అదేమిటంటే.
వచ్చే ఎన్నికల్లో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు లేవు అని.
అసలు విషయం ఏమిటి అంటే.
రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.మాజీ మంత్రులు.మాజీ ఎంపీలు.ఇతర కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని టీపీసీసీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
ఏఐసీసీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుని.పూర్తిస్థాయి పనులు ప్రారంభించిన తర్వాత తెలంగాణలో కీలకమార్పులు.
పార్టీలో అంతర్గత సంస్కరణలు జరుగుతాయని వారంటున్నారు.రాహుల్ అధ్యక్షుడిగా ఫీటం ఎక్కినా తరువాత జరిగే తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అందుకే అభ్యర్ధుల ఎన్నిక టికెట్స్ పంపిణీ వ్యవహారాలూ వచ్చే ఎన్నికల్లో చాలా కఠినంగా ఉంటాయని తెలుస్తోంది.పార్టీలో సీనియర్లు అనే కోణంలో మాత్రమే టికెట్లు వచ్చే అవకాశాల్లేవు… ముఖ్యంగా అభ్యర్థి యొక్క గత చరిత్ర అక్కడి ప్రజలలో అతనిపై ఎంత వరకూ ప్రజల సమ్మతి ఉంది అనే లెక్కలు వేస్తున్నారట.
ఎటువంటి రాంగ్ రిపోర్ట్ వెళ్ళినా సరే కాంగ్రెస్ లో నుంచీ గెట్ అవుట్ అంటున్నారట.పార్టీలో సీనియర్.అయినా జూనియర్ అయినా సరే ప్రజల ఆమోదం ఉంటేనే టికెట్ అంటున్నారట.
టికెట్స్ ఎంపికక కోసం అభ్యర్ధుల జాబితా పంపెలోగా ఎటువంటి వారిని సెలెక్ట్ చేయాలో అనేది త్వరలోనే ప్రతీ రాష్ట్రాలకి పంపుతాము అని వెల్లడించారు.మూడుసార్లు ఓడిపోయినవారికి టికెట్‌ను ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.2014 ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినవారికి కూడా టికెట్ గల్లంతయ్యే అవకాశముందని ఆయన వివరించారు.వరుసగా మూడుసార్లు అవకాశం ఇచ్చినా గెలవని అభ్యర్థి, ఇక వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం ఉండదనే అంచనాతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది…రాహుల్ అధ్యక్షుడిగా వస్తున్నాడు.కొత్త రక్తం వస్తోంది అంటూ చంకలు గుద్దుకున్న సీనియర్స్ కి రాహుల్ చాలా తెలివిగా పక్కన పెట్టె ఏర్పాట్లు చేస్తున్నాడు.
మరి సీనియర్స్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.







