హోదాపై కేవీపీ ప్లాన్ రివ‌ర్స్‌.. రంగంలోకి వైకాపా

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదంటూ ప‌దే ప‌దే చెప్పిన బీజేపీ.

హోదా మంచిదే కానీ, ప్యాకేజీ మ‌రీ మంచిద‌ని చెబుతున్న ఏపీ అధికార పార్టీ టీడీపీకి క‌ష్టాలు ఇప్ప‌ట్లో త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

కార‌ణాలు ఏమైనా.హోదా నుంచి త‌ప్పించుకునేందుకు కేంద్రం అనేక మార్గాలు వెతుక్కుంటోంది.

ఈ క్ర‌మంలోనే ప్యాకేజీ ప్ర‌క‌ట‌న చేసింది.దీంతోనే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌ని చెబుతోంది.

అయితే, హోదా కోసం ప‌ట్టుబ‌డుతున్న కాంగ్రెస్ మాత్రం దీనిని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని, పార్ల‌మెంటులోనే తేల్చుకోవాల‌ని నిశ్చ‌యించిన‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు గ‌తంలో ప్రైవేటు బిల్లు రూపంలో ప్ర‌త్యేక హోదాను విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చాల‌ని కోరుతూ రాజ్య‌స‌భ గ‌డ‌ప తొక్కారు.దీంతో ఈ బిల్లు విష‌యం అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Advertisement

దీనికి మ‌ద్ద‌తివ్వాలా వ‌ద్దా అనే అంశంపై ఏపీ అధికార పార్టీ టీడీపీ అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌నల త‌ర్వాత హోదా కోసం మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించింది.ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.

హోదా ఇచ్చేందుకు ఇష్టంలేని కేంద్రం మాత్రం ఈ బిల్లులోని కొర్రీల‌పై దృష్టి పెట్టింది.ఈ క్ర‌మంలోనే రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన ఈ బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నాయ‌ని ఇది ద్ర‌వ్య బిల్లు అని, దీనిని లోక్‌స‌భ‌లోనే ప్ర‌వేశ పెట్టాల‌ని రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ తేల్చి చెప్పారు.

దీనికి ముందు ఈ బిల్లును ఆయ‌న లోక్‌స‌భ స్పీక‌ర్ మీరాకుమార్‌కు పంప‌గా.ఇది ద్ర‌వ్య బిల్లు కాద‌ని తేల్చ‌డం గ‌మ‌నార్హం.

అయినా.లోక్‌స‌భ అధికారులు మాత్రం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

దీనిలో హైకోర్టు ముచ్చ‌ట ఉంది కాబ‌ట్టి ఇది ద్ర‌వ్య బిల్లేన‌ని చెప్పారు.దీంతో ఇది తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

Advertisement

అయినా.దీనిపై తాము సుప్రీం కోర్టులో ప్ర‌శ్నిస్తామ‌ని కేవీపీ చెప్ప‌డం విశేషం.

హోదాపై కేవీపీ ప్లాన్ ఫెయిల్ అవ‌డంతో ఇదే విష‌యంపై వైకాపా రంగంలోకి దిగింది.రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఏదైతే పాయింట్ ప్ర‌కారం దీనిని తిర‌స్క‌రించారో.

అదే పాయింట్‌తో వైకాపా ఎంపీ సుబ్బారెడ్డి లోక్‌స‌భ‌లో ఇప్ప‌టికే బిల్లును స‌మ‌ర్పించారు.ఇది సోమ‌వారం చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

దీంతో హోదాపై త‌ప్ప‌ని ప‌రిస్థితిగా బీజేపీ చ‌ర్చ‌లోకి రావాల్సి ఉంటుంది.ఇది ఒక‌ర‌కంగా బీజేపీ, టీడీపీల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే.

మ‌రి దీనిపై లోక్‌స‌భ ఎలా స్పందిస్తుందో చూడాలి.మొత్తానికి ఇప్ప‌టికైతే.

కేవీపీ ప్లాన్ మాత్రం ప్లాప్ అయింది .

తాజా వార్తలు