ఏపీని కాంగ్రెస్ హడావిడిగా విభజించింది అంటూ రాజ్యసభలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఇదే సమయంలో తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
విభజన చట్టం పై ఎటువంటి చర్చ జరగలేదు.ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని స్పష్టం చేశారు.
హడావుడిగా విభజన బిల్లును ఆమోదించారు.వాజ్ పాయ్.
మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశారని కొనియాడారు.ఆనాడు పార్లమెంటులో మైకులు కట్ చేశారు.
పెప్పర్ స్ప్రే.కొట్టారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అంటూ కాంగ్రెస్ పార్టీని మోడీ నిలదీశారు.
దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రియాక్ట్ అయ్యారు.
ఏపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్.బీజేపీ రెండూ ముద్దాయి లేనని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సరిగ్గా లేదని కాంగ్రెస్ పార్టీని మోడీ అనటం తప్పించుకోవటానికి చేస్తున్న వ్యాఖ్యలులా అనిపిస్తున్నాయి.తప్పు నాది కాదని మరొకరు…ఇలా ఒకరిపై మరొకరు.
తప్పులు నెట్టుకుంటూన్నారని… మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.
విభజన హామీలు నెరవేర్చడం లేదు.ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.
తిరుపతి సాక్షిగా మోడీ చేసిన వాగ్దానం.ఏపీకి స్పెషల్ స్టేటస్.
ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పదేపదే అడుగుతున్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ.ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బిజెపి బదులిస్తుంది అంటూ ఇది చాలా అన్యాయం అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.