వైఎస్‌ ఘనతను బాబు కొట్టేస్తున్నారా?

రాజకీయాల్లో ఒకరి ఒకరి ఘనతను మరొకరు కొట్టేయడం, ఒకరి క్రెడిట్‌ను మరొకరు సొంతం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది.ఇందుకు మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపచేయాలి.ఉన్నదాన్ని లేనట్లు నమ్మించాలి.

ప్రజలను మాయాజాలంలో పడేయాలి.నాయకులు తమను తాము ప్రమోట్‌ చేసుకోవడం ఓ గొప్ప విద్య.

ఇది అందరి వల్ల అయ్యేపని కాదు.ఇప్పుడున్న నాయకుల్లో అందులోనూ అధికారంలో ఉన్నవారిలో ఇద్దరు ఈ పని బాగా చేయగలరు.

Advertisement

ఒకరు.ప్రధాని నరేంద్ర మోదీ, మరొకరు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.గుజరాత్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా ప్రచారం చేయించుకున్నారు.

అక్కడే పటేళ్ల ఉద్యమం జోరుగా సాగుతోంది.గుజరాత్‌ వెళ్లి పరిశీలించి వచ్చిన విపక్ష నాయకులు, విశ్లేషకులు గుజరాత్‌ అభివృద్ధి హంబక్‌ అని చెప్పారు.

ఇందులోని నిజానిజాల సంగతి అలా ఉంచితే ప్రస్తుతం చంద్రబాబు వైఎస్‌ ఘనతను సొంతం చేసుకుంటున్నారని వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు.చంద్రబాబు ఏనాడూ నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపలేదని, సీరియస్‌గా తీసుకోలేదని, కాని వైఎస్‌ చేసిన పనులను తన పనులుగా ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 

తోటపల్లి ప్రాజెక్టు గురించి వైఎస్‌ కృషి చేస్తే దాన్ని తన క్రెడిట్‌గా బాబు చెప్పుకుంటున్నారట.పులిచింతల కూడా తన ఘనతేనని అంటున్నారట.

Advertisement

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గురించి బాబు గొప్పలు చెప్పుకుంటూ తనను తాను ప్రమోట్‌ చేసుకుంటున్నారని విమర్శించారు.ఈ ఆరోపణలు విషయం అలా ఉంచితే తన పనుల గురించి గొప్పగా చెప్పుకోవడం బాబుకు అలవాటే.

ప్రతి పనీ తానొక్కడే చేసినట్లుగా నేనే చేశా అంటూ ఉంటారు.తన ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చుగదా.

హైదరాబాదును నేనే అభివృద్ధి చేశా అంటూ ఉంటారు.అందులో కొంత వాస్తవం ఉంది కూడా.

కాని బాబు ఈ గొప్పలు చెప్పుకున్నప్పుడల్లా కేసీఆర్‌కు కోపం నషాళానికి ఎక్కుతూ ఉంటుంది.గొప్పలు అదే పనిగా చెప్పుకోవడం కూడా మంచిది కాదు.

తాజా వార్తలు