పార్టీ వీడనున్న వైసిపి మాజీ మంత్రి..?

అటు ఇటుగా ఏపీ లో ఎన్నికల హీట్ మొదలు అయ్యేందుకు ఒక సంవత్సరం మాత్రమే ఉంది.ఆంధ్రప్రదేశ్ లోనే ఏ పార్టీ నేతలు ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది ఊహించడం కష్టం.అయితే ప్రస్తుతం మాత్రం వైసీపీ నుండి మాత్రం ఒక అసమ్మతి నేత బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేకతోటి సుచరిత కు హోమ్ మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే.ఒక దళిత మహిళకు ఈ కేడర్ వచ్చిన తర్వాత జగన్ పై ప్రశంసలు కురిశాయి.అయితే అదంతా మున్నాళ్ళ చందంగా మారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈమె తన మంత్రి స్థానాన్ని కోల్పోయింది.

 Ysrcp Ex Minister Mekathoti Sucharitha To Leave Jagan Party Details, Ap Election-TeluguStop.com

అప్పుడు ఆమె అనుచరులు ఆందోళనలు కూడా చేశారు.అప్పుడు తీవ్ర ఆవేదనకు గురి అయిన సుచరిత ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆమె భర్త, ఐఆర్ఎస్ అధికారి దయా సాగర్ మధ్యప్రదేశ్ లో పదవి విరమణ పొందడంతో ఇప్పుడు ఆయన అడుగులు కూడా రాజకీయాలపై పడుతున్నాయట.అయితే వైసీపీతో ఈ కుటుంబానికి సరిగ్గా సంబంధాలు లేవు కాబట్టి ఆయన టిడిపి తో కలిసి అవకాశాలు ఉన్నట్లు ప్రచారం ప్రస్తుతం గుంటూరులో జరుగుతుంది.

Telugu Ap, Chandrababu, Ycp, Sucharitha, Ys Jagan, Ysrcp-Political

ఇక సుచరిత కూడా ఆయనను అనుసరించి అటే వెళ్లాలని ఆలోచిస్తుందట.అంతేగాని తానొక పార్టీలో తన భర్త ఒక పార్టీలో ఉండబోమని చెబుతోంది.గుంటూరు జిల్లా ఫిరంగి్పురానికి చెందిన మేకతోటి సుచరిత 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి తొలి ప్రయత్నం లోనే విజయం సాధించిన ఆమె వైయస్సార్ మరణం తర్వాత జగన్ తో చేయికలిపారు.2012 ఉపఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2014లో ఓటమి పాలు అయ్యారు.2019లో మాత్రం మంచి మెజారిటీ సొల్యూషన్ సాధించి హోం మంత్రి కూడా అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube