వైసీపీ ఒంటరేనట ! తోడు అవసరమే లేదట

ఏపీలో తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది.బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుందని.

ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకుంటారని టీడీపీ విమర్శలు గుప్పిస్తుండడంతో.ఆ అపవాదు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సిద్దమైయింది ఈ మేరకు తాము ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడంలేదని.

ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వైసీపీ ప్రకటించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ముడిపెడుతూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం.ఏపీలో బీజేపీ పై ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ ఉండడంతో ఆ ప్రభావం తమ పార్టీపై పడకుండా వైసీపీ వ్యవహరిస్తోంది.అందుకే.

Advertisement

కొద్దిరోజుల క్రితమే ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసారు.బీజేపీ, టీడీపీలు మొన్నటివరకు స్నేహపూర్వకంగానే మెలిగాయి.

కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యూహం మార్చి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు.మోడీకి ఎదురుగాలి ఉందని గ్రహించి బీజేపీ వ్యతిరేకుడిగా మారిపోయాడు.

తను చెప్పిన పనులన్నింటినీ మోడీ చేయకపోవడంతో బాబుకు కోపం వచ్చింది.అంతే అంతవరకూ బాబుకు గుర్తుకురాని రాష్ట్ర ప్రయోజనాలు కూడా గుర్తుకు వచ్చాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అంతవరకూ వద్దన్న ప్రత్యేక ప్యాకేజి సరిపోతుందని చెప్పిన బాబు ఆ తరువాత కాదు కాదు హోదా కావాలంటూ బీజేపీపై యుద్ధం చేస్తున్నాడు.వాస్తవంగా టీడీపీ - బీజేపీ కి స్నేహం చెడిన తరువాత బీజేపీ కి వైసీపీ దగ్గరయ్యింది.

Advertisement

ఇక ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అధికారకంగా ప్రకటించబోతున్నారు అనే సమయానికి బీజేపీ కి ఏపీలో ఎదురుగాలి వీయడంతో వైసీపీ కొంచెం వెనక్కి తగ్గింది.అందుకే బీజేపీతో లోపాయకారి ఒప్పందం బయటపడకుండా జాగ్రత్తపడుతోంది వైసీపీ.

తాజా వార్తలు