YSR Rythu Bharosa : ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులు విడుదల

ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ ( YSR Rythu Bharosa - PM Kisan )మూడో విడత నిధులు విడుదలయ్యాయి.ఈ మేరకు రైతుల ఖాతాల్లోకి రూ.

2 వేల చొప్పున సీఎం జగన్ ( CM Jagan )జమ చేశారు.మొత్తం 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ చేశారు.అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

వరుసగా ఐదో ఏడాది రైతుభరోసా అందిస్తున్నారని తెలిపారు.

ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 జమ చేశామన్నారు.ఈ ఐదేళ్లలో రైతుభరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.అలాగే 57 నెలల్లో పలు పథకాల కింద రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి జరిగిందన్న సీఎం జగన్ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను కూడా మనమే చెల్లించాలమని తెలిపారు.తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ( Free electricity )ఇస్తున్నామని వెల్లడించారు.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు