వైసీపీదే గెలుపు .. ఈ ధీమా వెనుక ఇంత వ్యూహం ఉందా ? 

ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగక ముందు, జరిగిన తరువాత కూడా వైసీపీ ఒకటే ధీమాతో ఉంది.

కచ్చితంగా మళ్ళీ తాము అధికారం చేపడతామని,  గతం లో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనే నమ్మకాన్ని పదేపదే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.

అంతేకాదు విశాఖలో ఈనెల తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా వైసిపి ప్రకటించింది  విశాఖలో అనేక హోటళ్ళ లో రూమ్ లు కూడా ముందుగానే బుక్ చేసి పెట్టారు.రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్( Exit polls) ఫలితాలలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని అనేక సర్వే సంస్థలు ప్రకటించాయి.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అనేక సర్వే సంస్థలు ప్రకటించాయి.

Ysps Victory Is There Such A Strategy Behind This Slowness, Aara Masthan Survey

ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత ఖచ్చితత్వం తో ఫలితాలను అంచనా వేసే ఇండియా టుడే 19 నుంచి 23 మధ్య లోక్ సభ స్థా నాలు వస్తాయని చెప్పింది.వైసీపీ రెండు నుంచి నాలుగు సీట్ల వరకు మాత్రమే గెలుస్తుందని చెప్పింది.దీంతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సర్వే నివేదికల ద్వారా తెలుస్తోంది .అయితే సర్వే సంస్థల్లో క్రెడిబిలిటీ ఉన్న  ఆరా మస్తాన్ సర్వే కూడా ఒకటి.ఈ సర్వే ప్రకారం వైసిపి అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్( Aara masthan) సర్వే తేల్చి చెప్పింది.

Advertisement
YSP's Victory Is There Such A Strategy Behind This Slowness, Aara Masthan Survey

దీనిని వైసిపి ప్రముఖంగా ప్రచారం చేసుకుంటుంది.ఆరా మస్తాన్ సర్వే నివేదిక ప్రకారం తాము అధికారంలోకి రాబోతున్నామని,  జనాలతో పాటు కింది స్థాయి కేడర్ కు కూడా సంకేతాలు పంపిస్తోంది.

ఒకవైపు కూటమి అధికారంలోకి రాబోతుందని అనేక ప్రముఖ సర్వే సంస్థలు ప్రకటించినా,  వైసిపి గెలుపు ధీమా వీడకపోవడం వెనుక కారణాలు చాలా కనిపిస్తున్నాయి.

Ysps Victory Is There Such A Strategy Behind This Slowness, Aara Masthan Survey

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అనేక వ్యవహారాలు చక్క పెట్టుకోవాల్సి ఉంటుందని,  అలాగే అధికారుల మీద పట్టు కోల్పోతే కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు తప్పవని , కౌంటింగ్ సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతుందని, అదే జరిగితే వైసీపీ( YCP party )కి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ముందుగానే గ్రహించి, జగన్ కచ్చితంగా తామే అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలను జనాలకు , పార్టీ కార్యకర్తలకు పంపిస్తూ , వారిలో ధైర్యం నూరి పోసే విధంగా గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు