టీడీపీ వారసుడు గా నారా లోకేష్ ని నిలబెడదాం అనుకుంటున్న తరుణం లో తెలంగాణా బాధ్యతలు అప్పగించగా అక్కడ మొత్తం ఖాళీ చేసి పెట్టాడు చిన్న బాబు.పార్టీ నుంచి వలసలు పెరగడానికి తెలంగాణా లో అధినాయకత్వం కొరతే ముఖ్యం అని అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పుడు ఏపీ లో కూడా చిన్న బాబు కి కీలక బాధ్యతలు ఇస్తున్నారు.అయితే మ్యాటర్ ఏంటంటే తెలంగాణా లో సూపర్ ప్లాప్ అయిన చిన్న బాబు ని ఏపీ లో సూపర్ సక్సెస్ చెయ్యడం కోసం ఆపరేషన్ ఆకర్ష లో వైకాపా ఎమ్మెల్యే లని ఇటువైపు లాగిన ఘనత మొత్తం లోకేష్ కి ఇచ్చేస్తున్నారు పెద్ద బాబు గారు.
ఇదీ నారా లోకేష్ పనితనం.
కొడుకు పనితనానికి ఇంకో పరీక్ష.
అంటూ గ్రేటర్ హైద్రాబాద్ బాధ్యతలు అప్పగిస్తే, పార్టీని చినబాబు నిండా ముంచేశాడు.మాధవరం కృష్ణారావు, టీడీపీని వీడే సమయంలో.
ఆయన్ని బుజ్జగించే బాధ్యత చంద్రబాబు, లోకేష్ భుజాన పెట్టిన విషయం విదితమే.రాజకీయాల్లో తలపండిపోయిన నేతలు, చినబాబు వద్దకు వచ్చి, వంగి వంగి దండాలు పెట్టాలంటే ఎలా.? అక్కడే తేడా కొట్టేసింది.మీకేమన్నా ఇబ్బందులు ఉంటె లోకేష్ చూసుకుంటాడు అంటూ వారికి లోకేష్ ని బాస్ చేసేసి పరేసారట బాబు.
ఊరికే ఖాళీగా ఉంచడం ఎందుకు ముఖ్యమైన విషయాల్లో క్రెడిట్ ఇస్తే లోకేష్ మరీ జీరో కాదు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది అని ఇలా చేస్తున్నారు ఏమో.ఇదంతా చూసిన వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు.







