సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ

కడప జిల్లా: సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. 2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాదపెట్టిన అంశం.

 Ys Viveka Wife Sowbhagyamma Letter To Cm Jagan Mohan Reddy, Ys Viveka Wife ,sowb-TeluguStop.com

మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం.హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం.

నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈవిధంగా.నీ పత్రిక, నీ టీవీ చానెల్,నే సోషల్ మీడియా.

నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం.

చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా ? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.నీకు మాత్రం పట్టడం లేదా ? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే.నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి ? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ? ఇంకా బాధించే అంశం.

హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం…ఇది సమంజసమా ? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు.ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్న.హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున.చివరి ప్రయత్నంగా…న్యాయం ధర్మం ఆలోచన చేయమని.నిన్ను ప్రార్థిస్తున్నా.

రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని…ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా.న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube