మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసుపై హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో( CBI Court ) విచారణ జరిగింది.అయితే ఈ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి( Kadapa MP Avinash Reddy ) గైర్హాజరు అయ్యారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ ఖైదీలను అధికారులు కోర్టులో హాజరు పరిచారు.కాగా ఆరుగురు రిమాండ్ ఖైదీలు చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.