వైయస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో( Congress party ) జాయిన్ కావడం తెలిసిందే.ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ).
సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం జరిగింది.అదే సమయంలో వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అనంతరం షర్మిల సంచలన స్పీచ్ ఇచ్చారు.తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన కృషి గుర్తు చేసుకోవడం జరిగింది.
వైయస్సార్ డ్రీమ్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.

నేను కూడా నా తండ్రి కల నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చేపడతానని తెలిపారు.అనంతరం శుక్రవారం మల్లికార్జున ఖర్గేతో.షర్మిల భేటి కావడం జరిగింది.
ఈ సమావేశంలో రాజకీయాల పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.ఈ క్రమంలో కుమారుడు రాజారెడ్డి( Raja Reddy ) వివాహ వేడుకకు రావాలని ఖర్గేనీ షర్మిల ఆహ్వానించడం జరిగింది.
అయితే ఢిల్లీ పర్యటన ముగించుకున్న వైయస్ షర్మిల శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కి చేరుకున్నారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించిన నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలాకి ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అన్నది తెలుగు రాజకీయాలలో చర్చినియాంశంగా మారింది.







