పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం

హైదరాబాద్ ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం ఆమెను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 Ys Sharmila Is Angry At The Behavior Of The Police-TeluguStop.com

ఈ నేపథ్యంలో షర్మిల పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తనను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పాలన్నారు.

తనపై ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అన్న షర్మిల తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.పోలీసుల అనుమతితో పాదయాత్ర చేస్తున్న అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

తమపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.అన్నీ వాళ్లే చేసి మేం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితని ఆరోపించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని షర్మిల స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube