జగన్ ,విజసాయిల మధ్య చిచ్చుపెడుతున్న షర్మిలా...రీజన్ ఇదేనా

జగన్ కి ఏ పోరు తప్పినా సరే ఇంటి పోరు మాత్రం తప్పడం లేదు.

జగన్ పాద యాత్ర ప్రారంభించిన సమయం నుంచీ మొన్నటి వరకూ కూడా వైసీపి నుంచీ కీలక నేతలు అందరు టిడిపి పార్టీ లోకి వెళ్ళిపోతూ వచ్చారు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు జగన్ కి ఘలక్ ఇవ్వగా కొంత మంది కీలక నేతలు జగన కి బై బై చెప్పడంతో జగన్ కి గట్టి షాక్ తగిలింది.

ఒక పక్క వైసేపి నుంచే కీలక నేతలు వెళ్ళిపోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడు ఇంటి పోరు మొదలయ్యింది అంతేకాదు జగన్ ఆత్మగా చెప్పుకునే విజయసాయి రెడ్డి కి జగన్ కి మధ్య జగన్ చెల్లెలు షర్మిల చిచ్చు పెడుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇంతకీ అసలు ఏమయ్యింది ఎందుకు షర్మిల జగన కి పంటికింది రాయిలా అయ్యింది అంటే.

ఒక పక్క వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పాగా వేయటం కోసం వైసిపి కసరత్తులు చేస్తోంది.గతంలో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పార్లమెంటును చేజార్చు కావడంతో ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.

మరో పక్క అసెంబ్లీ సీట్లు కూడా చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది.ఈ రెండు లక్ష్యాలు సాధించటం కోసం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

Advertisement

విజయ సాయి కూడా విశాఖపట్నం జిల్లాను దత్తత తీసుకున్నారు.అందులో భాగంగానే విశాఖపట్నం లోక్ సభ స్ధానంపై దృష్టి పెట్టారు.

అయితే ఇక్కడే ఇప్పుడు జగన్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది.జగన్ గతంలో జైలు లో ఉన్న సమయంలో షర్మిల వైసీపికి అన్నీ తానై ముందుకు నడిపించింది.

ఏకదాటి ఉపన్యాసాలు చేస్తూ కెడర్ లో జోష్ నింపింది.అయితే గత ఎన్నికల్లో వైజాగ్ నుంచీ పార్లమెంటు కు పోటీ చేయాలని అనుకున్న షర్మిల కోరిక విజయమ్మ ని ఎంపిక చేయడం వల్ల తీరలేదు.

అయితే విజయమ్మ ఏపీ బీజేపి అధ్యక్షుడు హరి బాబు చేతిలో ఓటమి చెందటంతో జగన్ కి భంగ పాటు తప్పలేదు.అయితే వచ్చే సారికి అయినా సరే వైజాగ్ నుంచీ షర్మిల బరిలోకి దిగాలని భావించింది కానీ ఈ సారి జగన్ ఆ సీటుని తన ఆత్మ సాయి రెడ్డి కి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో గత కొంతకాలంగా జగన్ పై తీవ్రమైన అసంత్రుప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

అంతేకాదు తాజగా విశాఖ సీటుని తనకే కేటాయించాలని పట్టుబట్టిందనే టాక్ కూడా వినిపిస్తోంది.ఒకవేళ చెల్లెలి కోరిక మేరకు జగన్ నిర్ణయం మార్చుకోవాలని అనుకున్నా సరే.విజయసాయి రెడ్డి జగన్ ఎన్ని కష్టాలలో ఉన్నా సరే జగన్ వెంటే నడిచాడు అంతేకాదు పార్టీలో కీలకంగా మారారు.కేంద్రంతో మంతనాలు చేయడం నుంచీ పవన్ కి టిడిపి కి మధ్య ఉన్న రిలేషన్ కి బ్రేక్ పడటంలో విజసాయి రెడ్డి కీలకంగా మారాడనే టాక్ కూడా ఉంది.

Advertisement

అయితే ఇప్పుడు జగన్ షర్మిలకి సీటు ఇస్తే ఎక్కడ విజయసాయి రెడ్డి పార్టీ కి దూరం అవుతాడని భయం మరో పక్క విజయసాయి కి ఇస్తే ఎక్కడ షర్మిల ఫైర్ అవుతుందో అని జగన్ తెగ టెన్షన్ పడిపోతున్నాడు.మొత్తానికి షర్మిల జగన్ కి విజయసాయి రెడ్డి కి మధ్య చిచ్చు పెట్టేలానే ఉందని వైసీపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

తాజా వార్తలు