తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మహబూబాబాద్ లో కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.
అక్కర్లేని కాళేశ్వరం విషయంలో మొండిగా ముందుకు వెళ్లి, కట్టిన మూడు సంవత్సరాలకే ముంచాడన్న ఆమె అందినకాడికి కమీషన్లు దోచుకున్నారని ట్వీట్టర్ వేదికగా విమర్శించారు.ప్రజలు అభిప్రాయాలు గెలవాలట.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలట.నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా.? ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా అని ప్రశ్నించారు.కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా అని నిలదీసిన షర్మిల గడీ దాటి నీ అడుగు బయటపడితే అక్రమ అరెస్టులు… నీ నోరు విప్పితే దొంగ హామీలు అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణలో దొరల పాలన సాగిస్తూ తాలిబన్ల రాజ్యంగా మార్చారని మండిపడ్డారు.కేసీఆర్ నియంత నిర్ణయాల కారణంగా ప్రజలే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







