వివేకానంద హత్యపై సిబిఐ ఎంక్వయిరీ జరగకపోతే కోర్ట్ కి వెళ్తా! జగన్ ప్రకటన

ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో అరాచక పాలన నడుస్తుంది అని, వ్యవస్థలని నియంత్రిస్తూ తనకి ఎదురు తిరిగే అందరిపైన దాడులకి పాల్పడుతున్నాడని, పోలీసులు, మీడియాని పక్కన పెట్టుకొని వైసీపీ కోసం పని చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చేసారు.

వివేకానంద హత్యపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలని కోరుతూ గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన జగన్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ఏపీలో ప్రజలు ప్రశాంతంగా ఓట్లు వేయాలంటే తక్షణం డీజీపీ, అడిషినల్ డీజీపీని మార్చాలని కోరామని, అలాగే సిబిఐ ఎంక్వయిరీ కూడా అడిగామని చెప్పారు.తన చిన్నాన్న జమ్మలమడుగు నియోజకవర్గం కన్వీనర్ గా ఉంటూ అక్కడ ప్రజలలో విస్తృతంగా తిరుగుతున్నారనే కారణంతో మృదు స్వభావి తనని హత్య చేసారని అన్నారు.

నిద్రపోయి ఉన్న సమయంలో ఇంట్లో దూరి చంపేశారని, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడుకి కూడా ఈ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదని, వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి అర్ధమవుతుంది అని విమర్శలు చేసారు.టీడీపీ కోసం పని చేసే ఇంటలిజెన్స్ అధికారి ఏబీ నాగేశ్వరరావు పాత్ర కూడా ఇందులో ఉందనే అనుమానం తమకి ఉందని జగన్ వాఖ్యలు చేసారు.

చంద్రబాబు పరిధిలో పనిచేయని మూడో పార్టీతో ఈ హత్య కేసుపై విచారణ చేయించాలని గవర్నర్ కి చెప్పడం జరిగింది అని జగన్ అన్నారు.

Advertisement
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తాజా వార్తలు