జగన్ తీరుపై సొంత నేతల అసంతృప్తి ? తీరు మారకపోతే ?

జగన్ పరిపాలనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

జగన్ ముందుచూపు గల నాయకుడని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయని ఇలా పదేపద ప్రశంసల వర్షం కురుస్తోంది.

బయట పరిస్థితి ఈ విధంగా ఉంటే సొంత పార్టీ నాయకులు మాత్రం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం జగన్ ను కలిసే అవకాశం దొరకడంలేదట.

తమ నియోజకవర్గాల సంబంధించి అభివృద్ధి పనుల విషయమై ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం లేకుండా పోతుందని, అసలు జగన్ ను కలిసేందుకు అవకాశం దొరకడం లేదనే బాధ ఎక్కువగా వారిలో కనిపిస్తోంది.జగన్ పూర్తిగా పరిపాలన వ్యవహారాలపై దృష్టి పెట్టి పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చ జరుగుతోంది.

గత టీడీపీ ప్రభుత్వం లో చంద్రబాబు కూడా ఇదే విధంగా వ్యవహరించారని, ఇప్పుడు జగన్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని వైసిపి నాయకులు జగన్ తీరుపై మండిపడుతున్నారు.పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అహర్నిశలు శ్రమించాము , ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉంది అనే బాధ పార్టీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

జగన్ సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాలు ఎన్నో అమలు చేసి దేశవ్యాప్తంగా ప్రశంసల్ని పొందుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పథకాలు అమలు తీరు అధ్వానంగా ఉందని, ప్రజల్లో కూడా ఈ విషయం పై అసంతృప్తి ఉందనేది ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్న మాట.క్షేత్రస్థాయిలో పరిస్థితులను గురించి పార్టీ అధినేతకు చెప్పుకుందాం అంటే తమకు అవకాశం దొరకడం లేదని వారు చెబుతున్న మాట.

ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై గళమెత్తారు.ఇసుక దోపిడీ గురించి మా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియదు.ఆయన మల్లె పువ్వు లాంటి వారు, ఇసుక దొరకలేదని సీఎంకు తెలిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు.

కానీ ఆయన దగ్గరకు చేరే మార్గం ఏది అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ తీరును విమర్శించారు.జగన్ చుట్టూ ముళ్ళ కంచె లాంటి కోటరీ ఉందని, దాన్ని దాటి వెళ్ళడం కష్టం అంటూ చెప్పుకొచ్చారు.

ఇక నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇంతే స్థాయిలో జగన్ తీరుపై బహిరంగంగానే విమర్శించారు.ఎన్నికల నియమావళి రాకముందే వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, ట్రామా కేర్ సెంటర్లు, ఆస్పత్రులు నిర్మించాలి.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్కును అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్..

గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినా సమాధానం లేదని, ఈ విషయం ఎవరికి చెప్పాలి ? ఏమని అడగాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నామని, నేను ఆందోళన, ఆవేదన తో మాట్లాడుతున్నాను అంటూ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు.ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఎంపీలు, ఎమ్మెల్యేలు , కీలక ప్రజాప్రతినిధులు అందరి బాధ ఇదే విధంగా ఉంది.

Advertisement

జగన్ సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతూ, కేవలం అధికారులతో మాట్లాడుతున్నారు తప్ప, తమను పట్టించుకోవడం లేదనే బాధ వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

తాజా వార్తలు