కేసీఆర్ జగన్ భేటీ ? కేంద్రం మధ్యవర్తిత్వం ?

ఇద్దరూ ఇద్దరే మొండి ఘటాలు.తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలని చూస్తుంటారు.

ఎక్కడా రాజీపడేందుకు ఒప్పుకోరు.అటువంటి పోలికలు ఉండబట్టే జగన్ కేసీఆర్ స్నేహం ఎన్ని వడిదుడుకులు ఎదురయినా ఇంకా బలంగానే కొనసాగుతోంది.

ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంలో తీవ్రస్థాయిలో నెలకొంది.ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర మధ్య పోతిరెడ్డిపాడు విషయంపై రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కట్టుగా పోతిరెడ్డిపాడు అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.అంతే కాదు కేసీఆర్ ను సైతం ఈ విషయంలో దోషిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి కే కృష్ణ రివర్ బోర్డు కు ఫిర్యాదు చేసింది.అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలుగజేసుకుని కృష్ణా జలాల విషయంలో నిజాలను నిగ్గుతేల్చిందిగా ఓ కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీకి రెండు నెలలు గడువు విధించింది.ఇక ఆ తర్వాత దీనిపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ఆసక్తి చూపిస్తోంది.ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది.

దీనిలో భాగంగానే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అపెక్స్ కౌన్సిల్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సభ్యులుగానే ఉన్నారు.జనవరిలో జరిగిన ఓ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మళ్లీ ఓ తేదీ న ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించుకోవాలి అని భావించారు.ఆ విధంగానే ఇప్పుడు రెండు రాష్ట్రాలు త్వరగా తమ అజెండాను పంపించాలని కోరుతూ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది.

Advertisement

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం కలగకుండా పోతిరెడ్డిపాడు అంశాన్ని చక్కదిద్దాలని కేంద్రం భావిస్తోంది.దీనికోసం రెండు రాష్ట్రాలకు మధ్య మధ్యవర్తిత్వం వహించాలని చూస్తోంది.ఈ మేరకు త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సమావేశం నిర్వహించుకుని పోతిరెడ్డిపాడు విషయంలో ఓకే క్లారిటీ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు