హెచ్-1, ఎల్-1 వీసాల్లో కీలక సంస్కరణలు.. ఇక వారికే తొలి ప్రాధాన్యం: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

అమెరికా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని చాలా మంది కల.

అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

ఈ మేరకు రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం ‘‘ ది హెచ్ 1 బీ అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్ పేరిట శుక్రవారం కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు.

దీని ప్రకారం అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.అలాగే అమెరికా పౌరుల ఉపాధి కాపాడటం కూడా ఓ ఉద్దేశ్యమని బిల్లులో ప్రస్తావించారు.ఇదే సమయంలో వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పనిప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రధానంగా తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్ 1 బీ, ఎల్ 1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని వారిని సొంతదేశానికి పంపుతున్న ఔట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లు ప్రతిపాదించింది.

Advertisement

దీని ప్రకారం.50 కంటే ఎక్కువ మంది పనిచేస్తూ వారిలో సగం కంటే ఎక్కువ మంది హెచ్ 1 బీ లేదా ఎల్ 1 వీసాదారులు ఉన్నట్లయితే, మరింత మంది హెచ్ 1 బీ వీసాదారుల్ని నియమించుకోవడాన్ని నిషేధించాలని బిల్లులో పేర్కొన్నారు.అలాగే ఉద్యోగుల నియామకాలు, వీసా నిబంధనల విషయంలో ఆయా కంపెనీలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు లేబర్ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టేలా ప్రతిపాదించారు.

కంపెనీలు హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు