యూట్యూబర్ హర్ష సాయి అంటే సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొన్ని కోట్ల మంది ఈయననీ టక్కున గుర్తుపడతారు.యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హర్ష సాయి ఎక్కడైనా పేదవారు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే అక్కడికి వాలిపోయి పెద్ద ఎత్తున వారికి సహాయం చేస్తుంటారు.
ఇలా పేదవారి అవసరాలను తీరుస్తూ ఏకంగా లక్షల్లో సహాయ సహకారాలు చేస్తుంటారు.ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి హర్ష సాయికి మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.

ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చే ఈయన సంపాదన మొత్తం పేదలకే ఖర్చు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి హర్ష సాయి తాజాగా రాజకీయాలలోకి రాబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.యూట్యూబ్ వీడియోల ద్వారానే ఎంతోమందికి సహాయం చేస్తున్నటువంటి ఈయన రాజకీయాలలోకి వస్తే మరి కొంతమంది నిరుపేదలకు సహాయం చేయవచ్చు అనే భావనతోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు జనసేన కండువా కప్పుకున్నట్లుగా ఫ్యాన్ మేడ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.హర్ష సాయి జనసేన పార్టీలోకి రావడమే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఎంతో సేవాగుణం కలిగినటువంటి హర్ష సాయి జనసేన పార్టీలోకి రాబోతున్నారని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.







