అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.దమ్ము, ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్ లపై కేసులు పెట్టాలన్న ఆయన అధికారులంతా కేసులలో ఇరుక్కుంటారని తెలిపారు.
నకిలీ పత్రాలతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.హిమాచల్ ప్రదేశ్ లో 22 వేల కార్లు పట్టుకున్నారన్నారు.
దేశంలో ప్రభాకర్ రెడ్డి మినహా ఎవరిపైనా కేసులు పెట్టలేదని విమర్శించారు.నావి 28 వాహనాలు అయితే 156 కేసులు పెట్టారని తెలిపారు.
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడని వ్యాఖ్యనించారు.ధర్మవరం ఎమ్మెల్యే… బైక్ రేస్, గుర్రాల రేస్ లు చేసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.







