దీప్తి సునయన( Deepthi Sunaina ) గురించి తెలియని తెలుగు కుర్రకారు వుండరు అనడంలో అతిశయోక్తి లేదు.మరీ ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు దీప్తి సునయన గురించి చాలా బాగా తెలుసు.
మొదట డబ్స్మాష్ వీడియోస్( Dubsmash Videos ) తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీప్తి తర్వాత కాలంలో పలు కవర్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ వెబ్ సిరీస్ లు( Web Series ) షార్ట్ ఫిలిమ్‌స్ తో జనాలను బాగా అట్రాక్ట్ చేసింది.
అప్పటినుండి ఇప్పటికీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో తన అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటుంది.ఆ తరువాత ఆమె ప్రయాణం బిగ్ బాస్ వరకూ వెళ్లిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.
చూడడానికి ముద్దుముద్దుగా వున్న దీప్తి సునయన అంటే అభిమానులకు ఎంతో ఆరాధన.అందుకే ఆమె సినిమా తెరపై కనబడితే చూసి తరించాలని ఎంతోమంది అనుకున్నారు.కానీ ఆ కోరిక పెద్దగా తీరింది లేదు.ఒకటి అరా సినిమాలలో ఆమె చిన్న చిన్న రోల్స్( Small Roles ) తప్పితే పెద్ద రోల్స్ చేసిన దాఖలాలు లేవు.
అయితే దీప్తి మంచి సూపర్ హిట్ సినిమాలను వదులుకున్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.అవును, ఆమెకి హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చుందని వినికిడి.
దానికి కారణం ఆమె కట్టుబాట్లే అని ఆమె అనుచరులు చెబుతున్నారు.తన ఇంట్రెస్ట్ కొద్ది మాత్రమే సోషల్ మీడియాలో యూట్యూబ్లో చేస్తుంది తప్పితే సినిమాలంటే ఆమెకి పెద్దగా ఆసక్తి లేదట.
ఈ క్రమంలోనే ఈ అమ్మడు టాప్ 3 బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ చేసుకుందని అంతా అనుకుంటున్నారు.అందులో ఒకటి, తేజసజ్జ హీరోగా నటించిన జాంబీరెడ్డి సినిమా( Zombie Reddy )లో హీరోయిన్ గా మొదట దీప్తి సునయన అనుకున్నారట.కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో వారు వేరే వాళ్ళని తీసుకున్నారట.ఆ తర్వాత డిజె టిల్లు సినిమా( DJ Tillu )లో కూడా హీరోయిన్ మొదట దీప్తి సునైనానే అట.అది కూడా ఆమె రిజెక్ట్ చేయడం కొసమెరుపు.అంతే కాకుండా యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఆమధ్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమా( Baby Movie )కు కూడా మొదట సదరు సినిమా టీమ్ దీప్తి సునైనా హీరోయిన్ అని అనుకున్నారట.
ఆమె ఆ సినిమాని కూడా రిజక్ట్ చేయడం గమనార్హం.ఇలా వరుసగా ఆమె మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకుందని తెలియడంతో ఆమె అభిమానులు కాస్త మనస్థాపానికి లోనవుతున్నారు.