సినిమా రంగంలో దర్శకుడు( Director ) అనేవాడికి సక్సెస్ ఎంత అవసరమో, ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.కాకలు తిరిగిన దర్శకుడైనా ఒక్క ప్లాప్ ఇస్తే ఇక అంతే… పేకప్ అవ్వాల్సిందే.
దానికి ఓ ఉదాహరణగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల( Srinu Vaitla )గారిని చెప్పుకోవచ్చు.అతను ఎటువంటి హిట్లు ఇచ్చారో అందరికీ తెలిసిందే.
ఆయన దర్శకత్వంలో వచ్చిన వెంకీ, రెడీ, ఢీ, దూకుడు కలెక్షన్ల వర్షం కురిపించి ఆయా హీరోల కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి ఆ చిత్రాలు.అయితే ఆ తరువాత వచ్చిన ‘ఆగడు’ అనే ఒక్క సినిమా శ్రీను వైట్ల సినిమా కెరియర్ని ఇరకాటంలో పెట్టేసింది.
అన్ని హిట్లిచ్చినా ఒక్క ప్లాప్ సినిమా అతని జీవితాన్ని నాశనం చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఇలాంటి పరిస్థితులలో కొందరు దర్శకులు చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు లేకపోయినా పెద్ద పెద్ద హీరోలతో సినిమా ఛాన్సులు కొట్టేస్తున్నారు.అవును, మీడియం రేంజ్ డైరెక్టర్లు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినా కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయని మీకు తెలుసా? ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది( Sampath Nandi ) గురించి మీరు వినే వుంటారు.మొదటి సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రచ్చ’ అనే సినిమా చేసి రచ్చ లేపాడు.
కట్ చేస్తే అది కూడా యావరేజ్ గా నిలిచింది.ఇదే కోవకు చెందుతాడు డైరెక్టర్ మారుతి.ఈయన తన కెరీర్లో చిన్న సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలను ఏమీ చేయలేదు.అలాంటిది ఇపుడు ఏకంగా ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమా చేసే అవకాదాన్ని అందుకున్నాడు.
మారుతి( Director Maruthi ) ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమా చేసిన దాఖలాలు లేవు.మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసాడు.అయినప్పటికీ ప్రభాస్ తో భారీ అవకాశాన్ని ఎలా అందుకున్నాడు అనే విషయం ఇపుడు చాలామందికి అంతు చిక్కని ప్రశ్నలా మారింది.ప్రస్తుతం సెట్స్ మీదకెళ్ళిన ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అయిపోతోందని సమాచారం.
అయితే కొంతమంది హిట్లతో ఎలాంటి సంబంధం లేకుండా వారికున్న పరిచయాలతో ఇలా అవకాశాలు అందిపుచ్చుకుంటారనేది అందరికీ తెలిసిందే.ఈ కోవకే చెందుతాడు దర్శకుడు మెహర్ రమేష్( Director Mehar Ramesh ).
మొదట చెప్పుకున్న ఇద్దరూ ఓ మోసరుగా హిట్లిచ్చినవారే.ఇక మెహర్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
అయినా మనోడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసిన దాఖలాలు వున్నాయి.మొత్తానికైతే ఈ డైరెక్టర్లు భారీ సక్సెస్ లు సాధించనప్పటికీ స్టార్ హీరోలతో అవకాశాలను అందుకోవడం అనేది గ్రేట్ అనే చెప్పుకొని తీరాలి.