యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్‌కు చేదువార్త... ఇక అవి డిలీట్ కానున్నాయి!

YouTube To Remove Cancer Treatment Misinformation,YouTube,YouTube Videos,Cancer Treatment Videos,False Information,Misinformation Videos

ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్ అనేది యువతకు కేవలం ఎంటర్టైన్మెంట్ కే పరిమితం కాకుండా ఉపాధికి కూడా ప్రత్యామ్నాయంలాగా మారింది.ఈ క్రమంలో యూట్యూబ్ లో వీడియోలు( YouTube Videos ) చేయడం ద్వారా సంపాదించే వారి సంఖ్య రానురాను ఎక్కువవుతోంది.

 Youtube To Remove Cancer Treatment Misinformation,youtube,youtube Videos,cancer-TeluguStop.com

కొత్త కంటెంట్‌ ను వీక్షకులు ఆదరించడంతో క్రియేటర్లు ఎప్పటికప్పుడు రకరకాల కంటెంట్ అందిస్తున్నారు.గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే, ప్రపంచ వ్యాప్తంగా 2.6 బిలియన్ యూజర్లు నేడు యూట్యూబ్ సొంతం.2023లో 29.24 బిలియన్ డాలర్లు ఆర్జించింది.ఇక గూగుల్ మొత్తం రెవెన్యూలో 11.35 శాతం యూట్యూబ్ నుంచే వస్తుండటం కొసమెరుపు.

Telugu Cancer, False, Youtube-Latest News - Telugu

ఏ చిన్న సమాచారం కావాలన్నా వీడియో రూపంలో తెలుసుకునేందుకు జనం బాగా ఆసక్తి చూపించడంతో యూట్యూబ్ కి మంచి ఆదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు.గత మూడేళ్లలో క్రియేటర్లకు యూట్యూబ్ 30 బిలియన్ డాలర్లు చెల్లించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య విభాగంలో కూడా సాధ్యమైనన్ని వీడియోలు చేస్తూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కాగా కరోనా( Corona ) అనంతరం ఈ తరహా వీడియోలకు మరింత డిమాండ్ పెరిగిందని చెప్పుకోవాలి.ఓ వైపు ఇవి పలువురికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని వీడియోలు స్థానిక వైద్య విభాగంతో పాటు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి.

Telugu Cancer, False, Youtube-Latest News - Telugu

ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్ వీటిపై కన్నెర్ర జేసింది.మార్గదర్శకాలకు అనుగుణంగా లేని ఈ తరహా వీడియోలపై వేటు వేస్తోంది.ఇకపై వీటిని పోస్ట్ చేసే ముందు నిబంధనలు కఠినతరం చేయబోతోంది.వెల్లుల్లి క్యాన్సర్‌( Garlic for Cancer ) ను నయం చేస్తుంది, రేడియేషన్ థెరపీ( Radiation Therapy )కి బదులు విటమిన్ C తీసుకోండి తరహా వీడియోలను రిమూవ్ చేస్తున్నట్లు యూట్యూబ్ తన బ్లాగ్ పోస్ట్ లో ఆల్రెడీ పేర్కొంది.

కంటెంట్ క్రియేటర్స్ నుంచి తప్పుడు సమాచారం నిరోధించడానికి, మార్గదర్శకాలు పాటించే విధంగా చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube