పెళ్లయిన రెండో రోజే భర్తకు విడాకులు ఇవ్వాలని ఓ మహిళ నిర్ణయించుకుంది.సోషల్ మీడియా( Social media ) పోస్ట్‌లో తాను విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఆమె వివరించింది.
తన భర్త తన కండిషన్‌ను ఉల్లంఘించాడని, అందుకే విడాకులు తీసుకుంటున్నానని పోస్ట్ చేసింది.అసలు పెళ్లైన దంపతులు ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఒక కేక్ వారిద్దరికీ పెద్ద గొడవలు పెట్టింది.చివరికి ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి విడాకుల వరకు వెళ్లింది.
ఆ మహిళ తాను చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో, మొదట తనకు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి లేదని పేర్కొంది.అయితే 2020లో తన బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేసినప్పుడు, ఆమె యాక్సెప్ట్ చేసినట్లు వెల్లడించింది.
ఇద్దరూ వివాహానికి సంబంధించిన బాధ్యతలను పంచుకున్నారు.అక్కడి వరకు ఎలాంటి వివాదం లేదు.

పెళ్లి రోజున నా ముఖానికి కేక్ పెట్టకూడదనే ఒకే ఒక్క షరతు ఉందని ఆ మహిళ చెప్పింది.‘నా గురించి సరిగ్గా తెలిస్తే వాడు ఇలాంటి తప్పు చేయడని నేను నమ్మాను.అయితే పెళ్లిలో మాత్రం ఈ జోక్ చేశాడు.పెళ్లి మధ్యలో సరదాగా నా మెడ పట్టుకుని కేక్‌లో ముఖం పెట్టాడు’.కేక్( Wedding cake ) తన ముఖానికి పూయొద్దని ఎంతగానో ఒప్పించిన తర్వాత కూడా తన భర్త అప్పటికే మరో కేక్‌ను సైతం సిద్ధంగా ఉంచాడని, ఇదంతా ముందస్తు ప్రిపరేషన్‌తో చేశాడని ఆ మహిళ చెప్పింది.అలాంటప్పుడు తనకు అస్సలు నచ్చలేదని దీంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించింది.

తన భర్తను క్షమించి అతనికి అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, తాను అతిగా స్పందిస్తున్నానని వారు భావిస్తున్నారని మహిళ తెలిపింది.కారు ప్రమాదం తర్వాత క్లాస్ట్రోఫోబిక్( Claustrophobic ) అనే భయంతో ఉన్నానని తన భర్త అర్థం చేసుకుని, అలాంటి వాటికి తాను మరోసారి భయపడకుండా చూడాలని ఆమె పేర్కొంది.అయినా అవేమీ తన భర్త పట్టించుకోలేదని, ఇలాంటి తన భర్తను క్షమించాలా అని ఆ మహిళ నెటిజన్లను ప్రశ్నించింది.ఆమె పోస్ట్‌కు నెటిజన్లు భిన్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు.







