తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాడు.అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని అరెస్ట్ చేసి సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా.జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
పోలీసులు ఆ యాంకర్ ను హుజూర్ నగర్ జైలుకు తరలించారు.ఇంతకీ ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఎవరు? ఆయన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
రఘు అనే ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తూ ఉంటాడు.అయితే ఓటీవల అతడు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించాడని, పోలీసులపై జరిగిన దాడులకు అతడే కారణమని.
అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో గురువారం యాంకర్ రఘును పోలీసులు మల్కాజిగిరి లోని తన నివాసంలో ఉండగా అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి రఘును పోలీసులు హుజూర్ నగర్ కు తరలించారు.అతడిని జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు.జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్ ను విధించారు.

దీంతో పొలీసులు రఘును హుజూర్ నగర్ జైలుకు తరలించారు.జర్నలిస్ట్ రఘు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు.
ఇక గుర్రంపోడు వివాదం విషయానికి వస్తే.
అక్కడి గిరిజనుల భూములను అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆక్రమించారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు.అక్కడ ఆందోళనలు జరిగిన సమయంలో 540 సర్వే నెంబర్ లోని భూములను పరిశీలించడానికి తెలంగాణ బీజేపీ ప్రధాన నేతలు కూడా వెళ్లారు.

ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వెంటనే పోలీసులను భారీగా మోహరించారు.ఇరు పార్టీల నాయకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.ఓ రేకుల షెడ్డును కూడా ధ్వంసం చేశారు.రాళ్లతో దాడి చేసుకున్నారు.
వారిని ఆపడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.అక్కడ ఉన్న సీఐ పై కూడా దాడికి పాల్పడ్డారు.
దీంతో కేసు నమోదయ్యింది.