తెలంగాణ హైకోర్టు దగ్గర హత్య కలకలం సృష్టించింది.గేట్ నంబర్ 6 వద్ద ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు.
అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడు.అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన నిందితుడు వారి ఎదుట లొంగిపోయాడు.
కాగా మృతుడు సులభ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్న మిథున్ గా గుర్తించారు.హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







