జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే మంచిది?

మాములుగా ప్రతి ఒక్కరు ఉంగరం అనేది పెట్టుకుంటారు.అదే జన్మ రాశిని బట్టి ఉంగరాన్ని ధరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

1.మేషం మరియు వృశ్చిక రాశులు మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు.వీరు పగడాన్ని ధరించడం మంచిది.2.వృషభ మరియు తుల రాశులు వృషభ మరియు తుల రాశులకు అధిపతి శుక్రుడు.అందువలన పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను గానీ, వజ్రాన్నిగానీ ధరించడం మంచిది.3.మిథున మరియు కన్యా రాశులు మిథున మరియు కన్యారాశులకు అధిపతి బుధుడు.అందువలన వీరు పచ్చను ధరించడం వలన మంచి కలుగుతుంది.4.కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు.వీరు మంచి ముత్యాలను ధరించడం మంచిది.5.సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు మాణిక్యాన్ని ధరించడం వలన చాలా మంచి జరుగుతుంది.6.ధనూ రాశి మరియు మీన రాశులు ధనూ రాశి మరియు మీనరాశులకు అధిపతి గురువు.ఈ రాశివారు పుష్యరాగాన్ని ధరించడం మంచిది.7.మకర కుంభ రాశులు మకర కుంభ రాశులకు అధిపతి శని.వారు నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందుతారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

తాజా వార్తలు